188
సంధి
“క్రీడు” శబ్ద మొక్కటి కనఁబడుచున్నది. మేలు, కీడు శబ్దముల. కీ భాషలో నిప్పటి యర్థము లాక్షణి కార్థమేగాని సహజమగు శబ్దార్థము కాదు. మేలు శబ్దము మీఁదు (త-- మేల్=ఉపరి, పైభాగము) అను శబ్దముతో సంబంధించినదై నట్లే, “కీడు” శబ్దము “కిందు" (త-కీళ్= అధో భాగము) అను దానితో సంబంధించినది. ఒకని కౌన్నత్యమును కలిగిం చునది మేలు (=శుభ వాచకమైనది-మంచిది) కాఁగా నధః పతనమునకు గారణమై క్రిందికి లాగునది "కీడు" అయినది. కావుననే “కీడు” నకు చెడ్డది అను నర్థము కలిగినది. కీడ్వడు .అనుదానికి క్రిందుపడు, తక్కు వగు అను నర్థమునఁ బ్రాచీన ప్రయోగములు గలవు. మఱియు నిది తమిళ కన్నడ మళ యాళములందు (దీర్ఘ) “ఈ” కారముతోఁ గూడి యే యున్నది. కీళ్' అనఁగా క్రిందు అని యర్థము, (T. Place or space below, beneath, bottom; K. the state of being low, meanness, a low in-ferior base man). తమిళమున “క్మీం” అనఁగా దోషము, తప్పు (Pault, blemish, defect) అనియు, సర్థము గలదు. తుళు భాషలో "క్ష్మీ”అనఁగా నై చ్యము (inferiority, baseness). దీని కీ భాషలతో “కీళ్" అనియు, తుళు భాషలో తెలుఁగునందు వలెనే “కీడు” అనియు రూపాంతరములు కలవు. క్రీజ్ జన, కీట్ జాతి= క్రిందిజాతి మనుష్యుడు (Alow caste man, an inferior man) కన్నడ మళయాళము
లందు తెనుఁగునందు వలెనే హ్రస్వాచ్ఛ రూపము
186
సంధి