Jump to content

పుట:సంధి (ఆంధ్రభాషా సంధి నియమముల చారిత్రక పరిశీలనము).pdf/179

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సమాస సంధి

181

"ఇ" కారముతోఁ గూడిన రూపము లీ భాషలోఁ గనఁ బడుట లేదుగాని, ఈ ధాతువు యొక్క మూలరూపమగు "మి” వర్ణము మిగులు అను శబ్దమునఁ గానవచ్చుచునే యున్నది. “మించు” (= ఒకదాని పైనుండు) అను ధాతువుకూడ 'మిన్- మిల్ ధాతువుయొక్క రూపాంతరమే. తమిళ కన్నడముల నీది “మిక్కు"-మిగు (to grow abundant, to increase, to exceed, to be over and above. to remain over) మిగిలు మిగలు (greatness, excellence, superiority remainder, rest) అనురూపములు గలిగి తెలుఁగునందలి “మిగులు" అను ధాతువుతో సభిన్నంబై యున్నది. "మించు” {to become great, to excel) ధాతువు తెలుఁగునందు వలెనే తమిళమునఁకూడఁ గనఁబడుచున్నది. కన్నడమున నిడి 'మించు' అను రూపమును బొందియున్నది. తక్కిన వాని కంటె మీఁదకు వచ్చినపుడే వానిని మించుట సంభవించును గావున "మేలు”….—మించులకు మూలధాతు వొక్కటియే యనవచ్చును. “మీఱు, మిట్టు" మొదలగునవికూడ "పైకి లేచ్చు. ఉన్నతమగు” అను నర్థమున “మీ” ధాతువునుండి. బయలు చేరిన మే. కావున మీ - మీన్ + కథ:= మీఁగడ యయినదనుటకు సందేహములేదు. "మీ” యొక్క రూపాం "వి తరమే "మే” యయియున్నది. కన్నడమున “మే” యను రూపమేగాక మేగు మేం మేల్ - (The upper side; the surface)అనురూపాంతరములుకూడ కలవు. ఏమే