23]
సమాస సంధి
177
విమర్శించుచున్న 'పరమ్, ఇళమ్' శబ్దముల ప్రాచీనరూపము లెట్టివో యించుక తెలిసికొందము.
“ప్రాఁత, లేఁత" యను తెలుఁగు శబ్దములలో సమా నార్ధకములై సజాతీయములని చెప్పఁదగిన మూల ధాతువులు "పఱి, పతె; ఏళ్, ఎళ, ఎళె" అనునవిగా గనఁబడుచున్నవి. కన్నడమునందలి పటి. పళె, తమిళమునందలి పట్టె, తెలుఁగు నందలి “ప్రా” యనునవి “ప్రాఁత" శబ్దముయొక్క మూల రూపములుగాఁ గనఁబడుచున్నవి. వీనికి పండుట, ప్రాచీనము అని యర్ధము. తమిళ మళయాళముల "పటు” అనుదానికి పరిపక్వమును జెందుట (to ripen, to grow old) అని యర్థము కలదు. కొన్ని సమాసములలో నీ శబ్దమనునాసిక రహిత మైయే గానవచ్చుచున్నది. కన్న. పటి అలగు (an old knife blade): పఱగన్నడ (ప్రాచీన గన్నడము), పఱనైల్ (ప్రాంత.. ధాన్యము). దీనినుండి హొసకన్నడమున 'హళసు=పాడగు' (to become ofd, worn out, decay, to go to ruin, to be spoiled) అను ధాతువుకూడ బయలు చేఱినది. తెలుఁగులోని “పాడు” ధాతువునకు “పాడగుట - చెడిపోవుట" యను నర్థము 'పఱ' ధాతువునుండి. యేర్పడినదే, ప్రాంతదియై క్షీణించి, చెడిపోవుటయే పొడగుట. “పాటిదిబ్బల”నఁగా చిరకాల నివాసముచే శిధిలములై పాడయిపోయిన యల్లు కూలిపో యిన పిదప నట నిలిచియున్న ప్రాత మట్టి దిబ్బలన్నమాట. ఇట్లు తెలుఁగులోని పొడు ధాతువు - "పలు” ధాతువునుండి.