172
సంధి
నిర్వాచీన రూపము లీ కాలమునఁగూడ వాడుకలో మనకు వినఁబడుచున్నవి. కావున లేదూడ, ప్రాయిల్లు అనునవి లేఁత ప్రాఁత శబ్దములతోఁ గూడిన సమాసములుగాఁ గనఁబడవు. వీనిలో పరపదాదియందు అచ్చో సరళమో యుండుటచే ననునాసికము విధించు నావశ్యకత లేకపోయినది. కాని పరు పొది శబ్దముతోఁ గూడిన ప్రాఁగెంపు, లేఁ గొమ్మ మొద లగు సమాసములలో ప్రాంత, లేఁత శబ్దములలోని యనునాసి కమును "మొదట లోపింపఁ జేసినను మరలఁ దెచ్చి పెట్టవలసిన స్థితి గలిగినది. కావున వా స్తవముగా ప్రాఁగెంపు, లేఁగొమ్మ మొదలగు సమాసములు తక్కినవానివలెనే ప్రాంత, లేఁత శబ్దములతోఁ గూడి యిటీవలి కాలమున నేర్పడినని గాక భాషలోఁ బ్రాచీనము లై యుండునని తలంపవలసి యున్నది. ప్రాత లేఁత శబ్దములలోని "త" కారము “మూఁత, కోఁత" చ్యేత మొదలగు వానిలోని 'త వలెనే యేదో యొక యర్థమున ఛాతువుపై వచ్చి చేరినదే గాని, సహజముగ ధాతునిష్ఠము- లేదా మూలరూప గతము కాదని తెలియుచున్నది. కావున "ప్రాంత” అనునది . ప్రాంత ప్రామ్త అని యుండఁ దగును. గావున దీని వెనుక టిరూపము “ ప్రామ్" అయియుందు సనుటకు సందేహము లేదు. ఇప్పటికిని దక్షిణ దేశమందలి తెలుఁగువారి శబ్దమును ప్రాంతీయనియె: పలుకుచున్నారు. ప్రాంత చింతపండు, తమిళ కన్నడములందీ యర్థముననే “పదమ్" అమ రూపముండుటనుబట్టి "పరమ్" అనునది యే of.