168
సంధి
చిహ్నమై యున్నదని తలంపనగును. “చెట్టెలుక” మొదలగు శబ్దములను తరువాతికాలమున చిట్టి+ఎలుక అని విభాగిం చుటచే భాషలో "చిట్టి చిటి శబ్దములుకూడ నేర్పడి యుండును. చిట్టిచాప, చిఱునగవు మొదలగు రూపములు “చిట్టెలుక” మొదలగు వానికంటె మిగుల నిర్వాచీనములు. పూర్వపదము విశేషణమై నిలిచినపు డందలి తుది సరళము పరుషమై ద్విత్వమును బొందుచుండుట మఱికొన్ని సందర్భములలోఁగూడఁ గానవచ్చుచున్నది. cf. త. పాంబు + కోడి,=పాప్పుకోడి; మకుందు + పై = మరుత్తుప్పై; ఇరుంబు + కోల్ = ఇరుప్పుక్కోల్, మాడు+తోల్, మాట్టుక్తోల్ . సరళాంతములగు నకర్మక ధాతువులు సకర్మకములై నపుడు గూడ ని ట్లే పరుషద్విత్వములు కలుగుచున్నవి. దీని కుదాహర ణము—త. పెరుగు- పెరుక్కు (=పెంచు) ; అడఙు - అడక్కు ; ఆగు-అక్కు (ఆపుట); నీఙ్గు-సిక్కు ; తిరుందు-తిరుత్తు ; నిరమ్బు-నిరప్పు, ఇరుమ్బు, పామ్బు, వేమ్బు, అమ్బు, ఎలుమ్బు మొదలగు బు నర్ణాంత శబ్దములన్నియుఁ దెనుఁగున ము వర్ణాం తములై వ్యవహరింపఁబడుచున్నను, సమాసములం. దివి. పూర్వపదములై విశేషణములగుట తటస్థించినప్పుడు పదాంత సరళ బవర్ణము తెలుఁగు సమాసములలో ఁగూడఁ బరువత్వ సమాసములలోఁగూడఁ మునే పొందుచున్నది. ' ద్విత్వముమాత్ర మిం దగ్గపడుట లేదు. ఇరుమ్బు+కోల్= ఇరుప్పుక్కోల్ అని తమిళ రూప మగు చుండగాఁ దెనుఁగున ఇనుపకోల మాత్ర