ద్విరుక్త టకారము
167
చెలుపుటకు కేవలస్థానమే సమర్థమయిన మార్గముగా గనపడ నప్పుడు - — అనగాఁ బూర్వపదముయొక్క విశేషణత్వము దాని స్థానమునుబట్టియే సువ్యక్తము కాదని తలంపఁబడినప్పుడు పూర్వపదమును విశేషణముగా మార్చుటకుఁగా ననేక మార్గము లవలంబింపఁబడినవి. వానిలో: బూర్వపదము తుది హల్లును ద్విత్వముచేసి పలుకుట యొకటి. “చిఱు” శబ్దము నందలి తుదిహల్లగు శకట రేఫమునకు ద్విత్వము చేసి (ఆ) అని పలుకునప్పుడు "ఱ" కార ధ్వని బయలుదేఱు స్థానమున నాలుకనొత్తి పలుకవలసియుండుటచే నా స్థానమున గలిగిన స్పర్శవలన స్పర్శవర్ణంబగు "ట" కారముతోఁగూడిన "ట్ " అను ధ్వని బయలు దేఱును. కావున కుఱు + ఉసుకు; చిరు + ఎలుక కుట్జ్ + ఉసురు, చిట్జ్ + ఎలుక' అనియు, పిడప రకార లోపముచే, 'కుట్టుసుగు', చిట్టెలుక అని సంధిగత రూపము లును వ్యవహారమున నేర్పడుచున్నవి. అట్లే “నడు” శబ్దము నందలి డకారమును ద్విత్వముచేసి పలికినపుడది పరుషత్వ మునుగూడఁ బొందుటచే “డ్డ” యనిగాక “ట్ట” యని పలుకఁ బడుచున్నది. పదమధ్యగత సరళము ద్విరుక్తిఁ జెందినపుడు ' పరుషముగాఁ బలుకఁబడుట ప్రాచీన ద్రావిడ భాషా సంప్ర దాయముగాఁ గనఁబడుచున్నది. కావున చిఱు, కుటు, నడు. శబ్దములందలి అకార డకారములు పదమధ్యమున ద్విత్వమును బొందినపుడు ద్విరుక్తపరుషములుగా నుచ్చరింపఁబడుట, యీ భాషలో నిలిచియున్న ప్రాచీన భాషా సంప్రదాయ