ద్విరుక్త టకారము
165
నడు+ఇల్లు=నడీల్లు, అని సంధి కావలసియుండఁగా నట్టి సంధి జరుగక, పూర్వమందలి ఱ కార డ కారముల స్థానమున ట్టకార మొకటి ఆ దేశముగా వచ్చుచున్నదనుట. ఱ, డల స్థానములో 'ట్ట' వచ్చుచున్నదనుట కంటె ఱ డ లకు అజాది పదము పరమగునపుడు అవి ద్విరుక్తటకారముగా మాఱు చున్న వనుట యు క్తతకంబయి యుండు నేమో? ఏల యనఁగా సంహితలోని రెండు పదములను జేర్చి యుచ్చ రించు సందర్భమున నుచ్చారణ సౌకర్యములు కనువగు ధ్వనులు (యకారము నకారము) ఏమయిన నడుమనునచ్చి యుచ్ఛారణకు సహాయము చేయవచ్చును, లేదా పూర్వ పరాక్షరములకుఁ గలిగిన సంయోగముచే నాయా వర్ణము లలోఁ గొంత మార్పు గలుగ గొంతమార్పు గలుగ వచ్చును. వచ్చును. కాని పూర్వపదాక్ష రములతో సంబంధములేని వర్ణము లెచ్చటనుండియో వచ్చి చేరువనుట సంభావ్యము కాదుగదా. అట్టివే కలిగినచో నవి యా పూర్వపరశబ్దముల సంబంధమును వ్యవక్తము జేయుట కుఁగాఁ బ్రాచీనకాలమునఁ జేర్పఁబడిన యొక ప్రత్యేక పదము యొక్క లుప్త శేషములగు వర్ణములయిననుఁ గావలయును. లేదా వేరొక శబ్దముయొక్క సామ్యముచేఁ (anology) జేర్పఁబడినవైనను గావలయును. కావున సంధిలో నాగమా 'దేశ విధానమున వైయాకరణులు చేసిన సందర్భములం దెల్ల నవి యెట్లు వచ్చినవో పరిశీలించి వాని సహజస్వరూపమును "గుర్తింప యత్నింపవలసియున్నది. ప్రస్తుతము “కుట్టున