Jump to content

పుట:సంధి (ఆంధ్రభాషా సంధి నియమముల చారిత్రక పరిశీలనము).pdf/153

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ప్రథమా విభక్తి ప్రత్యయ స్వరూములు

155

యుచ్చారణ సౌకర్యమునకై చేర్పఁబడుచుండు "ఊ" కారమువంటి దే యను తలంపుతోఁ జేయం బడియుండును. కొన్ని టిలో నచ్చు లోపించి కేవల కకారము మాత్రమే నిలిచి యున్నది. cf. తుళు తుద. క్. గ్. కన్నడమున నిది కె-గె యను రూపములు గలదై యున్నది.

విభక్తి ప్రత్యయములలో ద్రుతాంతమైనది ద్వితీయా ప్రత్యయమగు "ను" అనునది మఱియొకటియే కలదు. ఇదియు పై “కు” వర్ణమువలెనే పూర్వమున నికారమున్న పుడు నికారాంతముగా మాఱుచున్నది. కావుననే ని; ను, అనునవి రెండునుగూడ ద్వితీయా ప్రత్యయములుగా గ్రహింపం బడు చున్నవి. అయినను "సు" అనునదే దీని తొలిరూప మనుటకు సందేహములేదు. కన్నడమునఁ బ్రాచీన రూపములు హలంతములే యైయున్నవి. ప్రథమ మరం, ద్వి-మగమం, మరవమ్, మరనమ్. తుళు -యనమ్-(నన్ను); నినమ్-(నిన్ను), హొస కన్నడమున నీ హలంతరూపము లజంతములై నవి. అన్ను, ను, అనునవి ద్వితీయా ప్రత్యయములైన ఇదమ్=(దీనిన్) అవళమ్ మరమం... హో క ఇద్దన్ను అవళన్ను నవీ మరవన్ను = (వృక్షమును)..

దీనినిబట్టి యీ-ద్వితీయా- ప్రత్యయము భాషలో నెట్లే ర్పడియున్నను, ప్రాచీనకాలమున నిది హలంత మేయనియు