Jump to content

పుట:సంధి (ఆంధ్రభాషా సంధి నియమముల చారిత్రక పరిశీలనము).pdf/151

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

20]

ప్రథమా విభక్తి ప్రత్యయ స్వరూములు

153

"అందు" శబ్దమును కూడ నిటీవలివారు ద్రుతాంతముగాఁ జేసి యుందుకు. లేదా దీనిపైఁ గొంతకాలమునకు మరల ఉల్ (ఉన్) చేర్పఁబడుటచే (“అందులో” అన్నట్లే) “అందున్” ఏర్పడియుండును cf త, మరత్తినిల్, ప్రాచీన కాలమున నదీ కళయే యనుటకు శాసన ప్రయోగములు భారతాది ప్రయో గములుగూడ నిదర్శనము లగుచున్నవి. సామాన్యముగా “అందు+ఉండె=అందుండె" అను రూపమే వ్యవహారమునఁ బ్రసిద్ధము. ద్దము. “అందునుండే అనునదొకప్పుడు సముచ్చయా రకమగు ఉన్ అనుదానితో గూడినదియు గావచ్చును. ఇది కాన్యములలో ఛందస్సౌకర్యమునకుగాఁ బ్రయోగింపఁ బడుచు నుండె గాని వ్యవహారమున నంతగాఁ బ్రాచుర్య మును వహింపలేదు. కావున నిది యర్వాచీన రూపమని తలంపనగును.

ఇఁక చతుర్ధ్యర్థ ప్రత్యయమగు "కు” వర్ణముపై సంధి సైకల్పిక మగుటకుఁ గల కారణమును తెలిసికొనవలసి యున్నది.

దీని ప్రత్యయావస్థ చిరకాల రూఢమై యుండుటచే నిది యే మూలపదముయొక్క యవశిష్ట భాగమో తెలిసి కొనుట యంత సులభ సాధ్యముకాదు. కాని యర్థ సంబంధ మును బట్టి యిది యగు ధాతువునకు సంబంధించిన భాగమై యుండునని తలంపవచ్చును. ఏల యనఁగా రామునకు నిచ్చె అనునప్పుడా యియ్యఁబడినది. రాముని సంబంధముక అది