Jump to content

పుట:సంధి (ఆంధ్రభాషా సంధి నియమముల చారిత్రక పరిశీలనము).pdf/149

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ప్రథమేతర విభక్తి సంధి

151

లోపించిన నునర్థమునకు భంగము కలుగబోదు గావున నీ యుకారము లోపించి సంధి నిత్యముగ జరుగుట సంభవించినది.

-ప్రథమేతర విభక్తి సంధి-

ఈ పై కారణములచేఁ బ్రథమా విభక్తి ప్రత్యయ ములుగా గ్రహింపఁబడిన వాని యుకారమునకు సంధి నిత్య ముగనే జరుగవలసియుండెను. ఇంక బ్రథమేతర విభక్తుల లోని యుకారమునకు మాత్రము వైకల్పిక సంధి గలుగుటకుఁ గల కారణమేమో మనము పరిశీలింపవలసియున్నది.

సూ:-“ప్రథమేతర విభక్తి శత్రర్థ చు వర్ణంబులయం దున్న యుకారమునకు సంధి వైకల్పికముగా నగును.” అని 'బాలవ్యాకరణ సూత్రము.

ప్రథమేతరములగు విభక్తి ప్రత్యయములలో నుకా రాంతములై నవి ద్వితీయా ప్రత్యయమగు “ను”, చతుర్థి లేక షష్ఠీ ప్రత్యయమగు "కు”, సప్తమ్యర్థకమగు "అందు” అను నవి గలవు.

వీనిలో అందు అనునది "అ" అనుదాని రూపాంత రమే. దీని ప్రాచీనరూపము "అల్" అనునది. స్థల వాచక ములగు “అల్" ఇల్, ఉల్, శబ్దములలోని తుది లకారము నకారముగా మాఱుటచే “అన్, ఇన్, ఉన్" అను రూప ములఁ బొంది. సప్తమ్యర్థమున పదముల తుదిని జేరి కాలక్రమ 'మున` స ప్తమీ ప్రత్యయములుగా వ్యవహరింపఁ బడుతు