Jump to content

పుట:సంధి (ఆంధ్రభాషా సంధి నియమముల చారిత్రక పరిశీలనము).pdf/148

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

150

సంధి

మార్పుఁ జెంది "మ్రాఁకులచేత, మ్రాఁకులవలన, మ్రాఁకుల యుము” అనువానిలో "ల" కారముగాఁ గనఁబడుచున్నది. గనుకనే మొదటి “లు” వర్ణమును ప్రథమావిభక్తి ప్రత్యయ ముగా నైయాకరణులు గ్రహించియుందురు. కాని దాని పూర్వస్థితిని గమనించినచో నది ప్రథమా విభక్తికి ప్రత్యేక చిహ్నము కాదనుట వ్యక్తమగును. వాస్తవముగాఁ దక్కిన విభ కులలోఁ కూడ "లు" వర్షమేకలదు. కాని యీ “లు” ణ వర్ణాంత ప్రాతిపదికమునకును నీ శబ్దములకును గల సంబంధ మును వ్యక్తము చేయుటకుగా నౌపవిభక్తిక ప్రత్యయమగు నొక అ వర్ణము (ఇది విశేషణ విశేష్య భానద్యోతకము) చేర్పఁబడుటచే మ్రాఁకులు + అ + చేత = మ్రాఁకులచేత, మ్రాకుఁలు+అ+వలస౯ = మ్రాఁకులవల (మాఁకులయొక్క వలను) అనువానిలోని లు వర్ణము ల వర్ణమగుట తటస్థించినది. కావున బ్రథమలోని “లు” వర్ణమే తక్కిన విభక్తులయం దును గానవచ్చుచున్నదనియు నిధి బహువచనద్యోతక ప్రత్యయమే కాని ప్రథమా విభక్తి ప్రత్యయము కాదనియు నిర్ణయింపవలసియున్నది.

ఇట్లు ప్రథమావిభక్తి ప్రత్యయము లనఁబడుచున్నవి విభక్తి ప్రత్యయము లెంతమాత్రము కావనియు, వాని తుది నున్న ఉకారము . ప్రాచీన కాలమున హలంతములై యున్న శబ్దములపై నుచ్చారణ సౌకర్యమునకై చేర్చికొనఁబడిన దే గాని శబ్దగతము కాదనియు స్పష్టము. ఈ యుకారము