142
సంధి
విలక్షణమగు alveolar నకారమని చెప్పవచ్చును. ఏల యనఁగా దంత్యములని చెప్పఁబడుచున్న "త" వర్గాక్షర ములు నాలుకను పై దంతములకును దంతములకు సన్నిహిత ముగానున్న చిగుళ్లకును దగులునట్లుగా పఱచి తాఁకించినపుడు బయలు దేరుచున్నవి. కాని యా నాలుకనే కొంచెము కుదించి దాని యగ్రభాగమును దంతములకు దాఁకకుండ నా దంతము లకు సన్నిహితో పరి భాగముననున్న చిగుళ్లకుఁ దాకించినచో, మూర్ధన్యములగు ములగు "ట" వర్గధ్వనులకును జంత్యత వర్ల ధ్వనులకును మధ్యస్థముగ నుండు నొక విధమగు “ట” వగ్గ ధ్వనులు బయలు దేఱును. ఇవి పదాంతముననే సామాన్య ముగా వచ్చుటచే పదాంత టవర్గధ్వనులని చెప్పవచ్చును. ఇవి యింగ్లీషు భాషలోని తుది 'ట' కార ధ్వనిని, then అను దానిలోని నకారధ్వనిని భోలియుండును. ఈ వర్గము లోని యనునాసికమే తమిళమున నిప్పటికిని నిలిచియున్న రెండవ నకారము, MĪ.. అనఁగాఁ బదాంత్యమగు పొల్లు సకారము. ఒక పదము చివర నీ Alveolar నకార ముచ్చ కంపఁబడునే గాని దంత్య నకారమును, పలుకుట కష్టము. స్వాభావిక మునుగాదు. కావున వీనిని పదాంత టవర్గమని యనవచ్చును. శకటరేఫ్ మిచ్చట పుట్టినదే . కావుననే దే. "ఊ" ట్ర ట్ట యగుచున్నది.
“అవ" ఒన్, మూన్, మగన్ మొదలగు శబ్దముల లోని నకార మీ పదాంత నకారమే కావుననే దానిపై