ప్రథమా విభక్తి ప్రత్యయ స్వరూములు
139
ఇట్లు ప్రాచీనభాషలో “అమ్మంత ములగు శబ్దము లాయా భాషలలో 'ము' వర్ణాంతములు, 'ను' వర్ణాంతములు, “వు” వర్ణాంతములు గూడనైన ట్లగపడుచున్నవి,
సంస్కృత వ్యాకరణ ఫక్కిని కన్నడమున అమ్ అను నది ప్రథమా విభక్తి ప్రత్యయమని తలంపఁబడినట్లే దాని రూపాంతరమగు “ము” వర్ణము తెలుఁగునను, “వు” వర్ణము హొసగన్నడమునను ప్రథమావిభక్తి ప్రత్యయములుగ నే తలంపఁ బడుచున్నవి. కాని సహజముగ నవి విభ క్తిని సూచించినవిగావు. శబ్దగతములే యని చెప్పఁ దగియున్నది. ఈ దేశ్య పదముల తుదినిఁ గల “అమ్” అనునది యమహ ద్భానమును సూచించుటకో లేదా పూర్వపదమును విశేషణ ముగా మార్చుటలో, తరువాతి కాలమున నమహచ్చబం బులపైఁ జేర్పంబడిన “అత్తు" అను శబ్దమువలెనే, ప్రాచీన కాలమున నా యా శబ్దములపైఁ జేర్పఁబడి యుండుననియు నీ "అమ్" అనునది నిర్దేశార్థకా మహత్సర్వనామమయి యుండుననియు కాల్డ్వెల్ పండితుని యభిప్రాయమై యున్నది. ప్రశ్నార్థక సర్వనామమునుండి “ఏమ్ ” “ఏన్” అను అను నాసికాంత రూపములు బయలు దేరినట్లే "అదు” అను నిర్దే శార్థక సర్వనామమునుండి “అమ్ ” “అన్” అను సర్వనామ రూపములు గూడ బయలు దేఱి యుండవచ్చునని యాతడు తలంచెను.
ప్రాచీన భాషలో హలంతములైన శబ్దములు తరువాతి కాల మున నుచ్చారణ సౌకర్యముకొఱకై తుదినొక యుకారమును