Jump to content

పుట:సంధి (ఆంధ్రభాషా సంధి నియమముల చారిత్రక పరిశీలనము).pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

136

సంధి

మీపమ్, చుట్టమ్" మొదలైనవి. ఈ శబ్దము లన్నిటిలోను, ప్రథమైకవచనమునను బహువచనముననే గాక (ఫలము-, ఫలముల-; గుఱ్ఱము- గుఱ్ఱములు;) తక్కిన విభక్తు లన్నిటిలో నేకవచనమునను బహువచనముననుగూడ మువర్ణాంతమే యంగముగా నిలిచియున్నది. ఉదా. "ఫలము చేత, ఫలముల చేత, చుట్టమువలన, చుట్టములవలన” మొదలైనవి.

ఇట్లు సర్వవిభ క్తులలోను వచనములలోను ప్రాతిపదిక. కవయనముగ నే నిలిచియున్న యీ మువర్ణ మాంధ్రభాషలోఁ. బ్రథమావిభక్తి ప్రత్యయమెట్లు కాఁగలదు. సంస్కృత నపుంసక శబ్దములలోఁ బ్రథమా ద్వితీయైక వచనములు రెంటను నొక్క పేరూపము పొడచూపుచున్నను తక్కిన విభక్తులలోని.. యంగమందుఁ బై వానిలోని 'మ' కారము పొడచూప కుండుటచే నది సంస్కృతమందుఁ బ్రథమా విభక్తి ప్రత్యయ . ముగా గ్రహింపఁబడుట తటస్థించినది. కాని యిది తత్సమమై తెనుఁగునఁ జేరునప్పటికది ప్రాతిపదికావయవమే యైన దనవలసియున్నది. . చుట్టములు, చుట్టాలు ; ఫలములు, ఫలాలు ; మీసములు, మీసాలు; మొదలగు చోటులు బహు వచనమున నీ ‘ము’ వర్ణము లోపించుచుండుటనుబట్టి యది ప్రథమావిభక్తి ప్రత్యయమనుటయుఁ జొసగదు. ము వర్ణము లోపించినను అది లోపించినందులకు బదులుగా వెనుకటి యచ్చునకు దీర్ఘము కలుగుచునే యున్నది. చేయు నిధి యేకవచనమున నే విభ క్తిలోను లోపించుటయే లేదు