124
సంధి
.జెప్పవచ్చును. కాని చిరకాలమునుండియు నీ రూపమునకే ప్రాచుర్యము కల్గుటకుఁ గారణమేమైనఁ గలదాయని విచా రించినచోఁ బ్రాచీన కాలమున నిట్టి వనేకములు ఉకారాంత ములే యైనట్లు తెలియవచ్చుచున్నది. తనివు--తనివి; చెలువు, విరివి, నిడుపు—నిడివి, cf. తల్లి అఱివు, "ఉలివు" అను శబ్ద ముకారాంతముగనే కనబడుచున్నది. తెలివు+ఒంది - తెలి పొంది యని సులభముగా నగును. ఇకారము పైకంటే నుకా రముపై నిత్యముగా సంధిచేయుట యీ భాషలో నొక్కుడు ప్రాచుర్యము వహించియుండుట సుప్రసిద్ధ మేగదా.
ఇంకా 'ఒక టేల' 'డెబ్బదేను' 'అరువదేను' అను నికార సంధులని తలంపఁబడుచున్నవి. ప్రాచీన కాలమున "ఒకఁడు+ఏల" "డెబ్బదు (త. ఎళ్పదు. ) + ఏను” “అరు వదు+ఏను" అని ఉకారాంత పదములతోఁగూడి భాషలో స్థిరపడిన వేయైయుండును. ఈ యుకారాంత శబ్దములు కాల · క్రమమునఁ దెనుఁగున నికారాంతము లగుటచే నిచ్చట జరిగి నది ఇకార సంధియేయని వైయాకరణులు తలంచుట కవ కాశమేర్పడినది. ఇప్పు డికారంతములైయున్న శబ్దము లనే కములు ప్రాచీన కాలమున నీ భాషలో నికారాంతములుగాక హలంతములో . ఉకారాంతములో యైయుండెననుటకు సం దే . హము లేదు. పది' శబ్దము కూడ నిట్టి దే. ఇది ప్రాచీన భాషలో "ఫత్ " అను రూపముగలదై యుచ్చారణార్థము తుదినొక
యర్థమాత్ర యద్ధమా త్రోశారముతో, కేర్చి వ్యవహరింపఁ బడుచు