Jump to content

పుట:సంధి (ఆంధ్రభాషా సంధి నియమముల చారిత్రక పరిశీలనము).pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

16]

ఇకారసంధి

121

ప్రయోగములన్నియు నేమ్యాదులలోఁ జేరుచున్నవి. భాషలో నికారమంతమందుఁగల శబ్దములలో నేయే శబ్దములకు సంధి యగునో వేనికిఁగాదో నిశ్చయించి చెప్పుట కవకాశము లేదనియు వ్యవహారమునుబట్టిఁయు, బ్రయోగమునుబట్టియునే వీని సాధుత్వమును నిర్ణయింపఁదగియున్నదని చెప్పుటయే దీని నాకృతి గణంబుగాఁ జేయుటలోఁ గల విశేషము. ప్రాచీన లక్షణ గ్రంథములగు ఆంధ్రభాషా భూషణ సర్వ లక్షణసార సంగ్రహాదులందుఁ బేర్కొనఁబడిన “బంతిది, పెం డి, వెండుంగరము, సైడందెలు, తండ్రేడి" మొదలగు స్థలములలో నికారము పూర్వపదములోని భాగమేయైనను అర్థమునకు మునకు భంగము కలుగకుండగనే యది లోపించి సంధి జరుగుటచే బాలవ్యాకరణకర్త వీని నాకృతి- గణములోఁ జేర్చి స్వరమే యిచ్చట శబ్దరూప గ్రహణమునకు దోడ్పడు చున్నది.

ఇట్లు వ్యవహార ప్రాచుర్యమునుబట్టియుఁ గవి ప్రయో గములనుబట్టియు నే పై శబ్దములలో వికల్పసంధిని తిమ్మ కవి చెప్పియుండును. "మగనాలు" అను దాని సహో బలపతి సుదాహరణముగా నిచ్చెం గావున లాక్షణిక కవుల ప్రయోగము లారయనిది విరుద్ధ ప్రయోగములు కన్పడి నంతమ్మా తమున వానిని ధారాళముగా సాధువులని యెంచఁ . గూడదని గుప్తార్ధ ప్రకాశీకా కారుఁడు హెచ్చరింపఁ జొచ్చి యున్నాడు. శ్రీనాథుని కాశీఖండమున “ఓర్మిమై సుప్పిండి యుపవాసముండ నీ మగనాలి సరిఁబోల్పఁ దగుడు విధవ”” అని