Jump to content

పుట:సంధి (ఆంధ్రభాషా సంధి నియమముల చారిత్రక పరిశీలనము).pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

120

సంధి

కావున హలంత శబ్దముపై నచ్చు నిలచినపుడు హల్లచ్చుతో నెనయుటచే సంధి జరిగిన రూపములే ప్రాచీనకాలమునుండియు భాషలో నేర్పడియుందును. తరువాతి కాలమున నాంధ్రమున నికారముచ్చారణ వశమున వచ్చి చేరిన పదప నది సహజ ముగ శబ్దగతమే యని తలపఁబడినపుడు సంధి జరుగక యడా గమము వచ్చిన రూపముకూడ నేర్పడుటచే వికల్ప సంధి గలిగినది. ఇతర భాషలలోని యంజ్యోకారము నిందలి యికారమువలెనే యుచ్చారణ వశమున వచ్చిన దేశాని సహజమున నీ శబ్దములు హలంతములే యనుటకు తక్కిన మహన్మహత్యర్ధక రూపములగు “అవన్” “అవల్ ? *ఇవన్ ” "ఇరళ్" అనునవి గూడ హలంతము లగుటయే కాక గోండు భాషలో నీయమహదగ్ధక రూపములు కూడ “అది” “ఇన్” అని హలంతములే యగుటయుఁ దార్కాణములగుచున్నవి. తమిళమున వీని తుది యుకారమునకు సంధి వికల్పమే యైనను పరుషముపై వచ్చు నీ యుకారము “కుత్త్రియల్” ఉకారమే కావున నర్థన మాతకంబగు దానికి లోపమే సహజ మని తలం పసగును.

> ఏమ్యాదు లాకృతి గణంబని చెప్పఁబడినది. ఆకృతి. గణంబనఁగాఁబోలికచే సూహింపఁబడఁదగిన పదసముదా యము, అనఁగా నికార వికల్పసంధి జరిగి వ్యవహారమునఁ బ్రసిద్ధములైన శబ్దములన్నియు నీ సూత్రముచేతనే సాధింపం దగినవనుట. కావున "ఇ" "కార సంధి జరిగిన ప్రాచీన కవి