Jump to content

పుట:సంధి (ఆంధ్రభాషా సంధి నియమముల చారిత్రక పరిశీలనము).pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఇకారసంధి

119

ధాతువునకు సంబంధించిన దే. "రామునకు” "237"- అనఁగా- రామునిది యగునట్లు నీది యగునట్లు అని యగ్గము సిద్ధించును. 'కు' వర్ణము వా స్తవముగా సంప్రదానార్థమును సూచించునదై 'యేర్పడినదే గావున (తక్కిన భాషలలో నిది చతుర్థీ ప్రత్యయముగా నే గ్రహింపఁబడుచున్నది. తెలుఁగులో మాత్రమే షష్టీ ప్రత్యయమయినది. చతుర్థిలోను మరొక విధముగా – కొఱకు, కై లలో నగసడుచునే యున్నది) “రాముని దగునట్లు” ఇచ్చెను, అను నర్థమిచ్చుచున్నది. “అగునట్లు" అనునదంత తద్ధర్మార్థ రూపములం దగపడు చున్న నకారమే యీ కు నర్ణముపైని గనఁబడు గుండుటచే నిది ద్రుతాంతమైనది. ఈ తుది నకారముతో నచ్చు గూడిన రూపములు భాషలో ప్రాచీనములు, సంధి జరిగిన రూపములు నవీనములునై యుండును. కాని సామాన్యముగా నీ భాషలో పదాంత మందలి ఉకార ముచ్చారణార్థమై వచ్చి అచ్చుపరమైనపుడు లోపించుచుండుటనుబట్టి ఉకార సంధి ప్రాచుర్యమును వహించుటచే నట్టిరూపముల సామ్య ముచే కాలక్రమమున నీ "కు" వర్ణముపై గూడ సంధిగలిగి “రామునికిచ్చె”. వంటి సంధిగత రూపములకే వ్యవహార బాహుళ్యము గలిగినట్లగ పడుచున్నది.

అది, అవి, ఇది, ఇవి, ఎది, ఎవి. ఈ యమహత్సర్వ సామ శబ్దములన్నియు . నితర భాషలలో నుకారాంతములై, యున్నవి.. ప్రాచీనభాషలో హలంతములే మైయుండును.