ఇకారసంధి
117
శకట రేఫము ద్విత్వము చెందినపుడెల్ల ప్రాచీన కాలమున నది "స్త్రీ" యని యుచ్చరింపఁబడుచుండెడిది. ఇప్పుడు తమిళమునఁ గూడ నట్లే పలుకఁబడుచున్నది. ఈ కారణము చేతనే తెనుఁగున, “చిఱు, చిట్టి, కుఱు, కుట్టు కుట్టుసురు) మొదలగు రూపములు కొన్ని వ్యస్తముగను, కొన్ని సమా సములలోను గానవచ్చుచున్నవి. ఈ 'మాఱు = మాట' యనువానికి తమిళ మళయాళ రూపములు మాఱ; తు. మాఱు---మాఱ్ఱ, మాఱ్ఱు అనియుఁ గలవు. వ్రాంతలో ద్విత్వ శకట రేఫమే కనఁబడినను ఉచ్చారణమున ద్విత్వట కారము "ట్ట" అని వినఁబడును. కావున నామవాచకరూపమున మాఱు ధాతువు నందలి శకట రేఫము ద్విత్వము చెందు టచేఁ మాఱ్ఱు, మార్జి అను రూపము లేర్పడి ముచ్ఛారణ మున మాట్టయై రేఫము లోపించినపుడు 'మాట' అను రూపమేర్పడి తెనుఁగులో నిలిచినదనుటకు సందేహము లేదు. ఇట్లు మాఱు ధాతువు నుండియే మాటశబ్ద మేర్పడినను ఈ మాటకు పూర్వరూపంబగు మాఱు శబ్దమే దీనికి విశేషణ ముగా ముందు నిలుచుట తటస్థించినది.
ఇంక “మఱి"— అనునది 'మాఱు' ధాతువునకు రూపాంతరమగు 'మఱు' అనుదానినుండి యేర్పడినదే. పైని జూపఁబడిన యితర భాషారూపములు “మాఱు, మఱు' అని ఉకారాంతములే యగుటచేతను. పలుమాఱు, పలుమఱు, మఱుమాట, మఱుపటి క్ర. మఱుచల్ – మరుసల్ – Second)