Jump to content

పుట:సంధి (ఆంధ్రభాషా సంధి నియమముల చారిత్రక పరిశీలనము).pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఇకారసంధి

115

లగుచున్నవి. "ఏది” అను నమహదర్థసూచక మగు శబ్ద మును పోలినది తమిళమున "ఎన్నదు” అనునది. ఇది “ఎస్” అనుదానికి అదు శబ్దమును జేర్చుటచే నేర్పడినది. దీని బహువచన రూపము "ఎన్న" అనునది. అది ఏకవచనమునఁ గూడ వాడుకలోనికి వచ్చినది. కన్నడములో 'ఏను' అనునది కేవల ప్రశ్నార్థకావ్యయము గాక సర్వనామమై విభ క్తి ప్రత్య యములఁగూడ గ్రహించుచున్నది. తెలుఁగున సామాన్య వ్యవహారములో " ఏమియో అనుదానికంటె ఏమో (ఏమ్+ఓ) అనునదే యెక్కుడు ప్రచారములో నున్నది. ఇది తమిళ కన్నడ మళయాళములలో "నో" అనురూపము గలదై యున్నది. ఆ భాషలలో "పన్" అనుదానికి “పని” రూపాంతరముగాని "ఏనియో” అను శబ్దముగాని లేకుండు టచే నాంధ్రమున “ఏమి” అనుదాని యందలి తుది "ఇ"శా రము కన్నడమునందలి “ఏము” అనుదాని "ఉ"కారమును గూడ నుచ్చారణవశమున వచ్చి చే చేరిననే యని మనము నిశ్చ యింపవచ్చును. వ్యవహారమున “ఏమి” అనుదానికి బదులుగా “ఏఁ=ఏమ్” అనునది ప్రసిద్ధమై యుండుటనుబట్టి, కూడ నిది హలంతమనియే చెప్పఁదగియున్నది. Cf. “నీకే భ్రాతియే నెన్నలుంబాలు” “శవము క్రియనుండెడి దే”—ఏమి? కావున "“ఏమ్+ఇది = ఏమిది". అను రూపమే ప్రాచీనసంప్రదాయాను సార మైన ట్లగ పడుచున్నది. ఏమి యిది అనునది తుది యికా రము శబ్దగతమే యని తలంపఁబడిన పిదప ఛందసౌకర్యము