114
సంధి
జమై యుండెననియు, ఛందస్సౌకర్యము మొదలగు కారణ ములచే సంధి జరుగక యడాగమము వచ్చిన రూపము లిటీ వలికాలమున వాడుకలోనికి వచ్చినవనియుఁ దలంపఁ దగి యున్నది.
ఇంక ఇకార సంధి సందర్భమున నేమ్యాదుల ఇశార మును గూర్చి పరిశీలింపవలసి యున్నది. దీనికి సంధిపైకల్పిక మని చెప్పఁబడినది గావున నీ శబ్దములయందలి తుది యకా రము సహజమా? ఆగంతుళమా ? అను విషయ మించుక విచారింపవలసియుండును. దీనిని నిర్ణయించు పట్ల నీ శబ్దముల నితర ద్రావిడ భాషారూపములతోఁ బోల్చి చూచుట యు క్తము. ఈ గణములో మొదటిదగు “ఏమి” శబ్దమును గ్రహింతము.
ఏమి—ద్రావిడ భాష లన్నిటిలోను ప్రశ్నార్థక సర్వ నామరూపము "ఎ" "ఏ" అను మూలరూపములకు నకార, దకార, మకారములను జేర్చుటచే నేర్పడినట్ల గపడుచున్నది. త. ఎదు ; తె. ఎది, ఏది, అని దకారముతోఁ గూడిన శబ్ద ముల కంటె నకార మకారములతోఁ గూడిన కె. ఏమి, .త. పన్, మ. ఏన్ అనునవి కేవల భావార్థమును (Abstraet idea) సూచించునవై యున్నవి. ఎదు, ఏది, అనునవి ఇంగ్లీషులోని Which శబ్దమువలె నమహదగ్ధమును సూచించు చుండ, ఏన్, ఏమి అనునవొక నిర్దిష్ట వస్తువునుగూర్చి గాక ఇంగ్లీషులో What అను శబ్దమువలె సామాన్య ప్రశ్నార్థకము