Jump to content

పుట:సంధి (ఆంధ్రభాషా సంధి నియమముల చారిత్రక పరిశీలనము).pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

15]

ఇకారసంధి

113

తద్వ్యాఖ్యాతకుఁగాని విరుద్ధముగా కనబడినట్లే ప్రథమపురుష క్రియల ఇకారమునకుఁ బ్రకృతిభావము కల్గుట యప్పకవికిఁ శాస్త్ర విరుద్ధముగా గనఁబడినది. మధ్యమపురుష క్రియా రూపము విషయమునఁ బ్రకృతిభావమును నిరాకరించుట సాహసము కాకుండ ప్రథమపురుషక్రియలను గూర్చిన యాక్షే పము మాత్రమే సాహసం బనుట యెట్లు పొసంగును. మొదటి దానిని నిరాకరించుట కే బాల వ్యాకరణ సూత్ర మాధార ముగా గ్రహింపఁబడినదో శ్రీనాథుని ప్రయోగమును నిరాక గించుటకు నా యాంధ్రశబ్దచింతామణి సూత్రమే (అప్ప కవి చేసిన వ్యాఖ్యానము ప్రకారము) ఆధారముగా గ్రహింపఁ బడినది. “ప్రయోగశరణా వైయాకరణాః" అను భావమును వదలి “శాస్త్రప్రయోగవచసోః శాస్త్రం బలవ దుచ్యతే” అను శాసనమునే శిరసావహించుట న్యాయ్యమని తలం చినచో నీ నిరాకరణములకు నా క్షేపములకును హద్దే యుండదు. లాక్షణికులలోనే యభిప్రాయభేదము కలుగుచునే యుండును. ఒక కాలమందలి భాషాలక్షణమునకును దాని తరువాతి కాలమందలి లక్షణమునకును భేదముండక తీరదు. కావున నా యా కాలములు స్థిరపడిన భాషారూపములను, చారిత్రిక దృష్టితోఁ జూచి సమన్వయింపవలసినదే కాని కేవల లాక్షణిక దృష్టితోఁ జూచినచో దోషములని చెప్ప వలసి వచ్చుచుండును. పరిశీలింపఁగాఁ గ్రియా పదముల ఇ కార మునకుఁ బ్రాచీన కాలమునుండియు సంధి కలుగుటయే సహ