112
సంధి
నుండిట వచ్చినారలు" అను స్వర్గలక్షణసార సం గ్రహమందుఁ బేర్కొనఁబడిన లక్ష్యమునఁ గొనవచ్చుచునేయున్నది. పై నాని సంగీకరించి దీని సంగీకరింపకుండుటకుఁ గారణ మగ పడదు. కావునఁ గ్రియాపదములందలి ఇత్తునకు సంధి వైకల్పి కమని చెప్పుటయే ప్రస్తుతస్థితి యందు న్యాయ్యముగాఁ గనఁ బడుచున్నది. అందువలననే తాత్కాలిక వ్యాకరణ సూత్రా స్వయమునకు విశుద్ధమగుట చే స్వర్గలక్షణసార సంగ్రహకారుఁ డిచ్చిన “శ్రోచితికి యెచ్చట" అను ప్రయోగము నిరాకర నుని చెప్పుట లక్ష్యైకదృష్టిలేని కేవల శాస్త్ర ప్రామాణ్యపద్ధ తినే సూచించుచున్న దనవలసియున్నది. ఇంక "కూర్చుండిరి యొండొరుం గదిసి” అను శ్రీనాథ ప్రయోగమును గూర్చి -
కం. విరచించెను శ్రీనాథుఁడు
ధరణీని శృంగారనైషధంబునఁ గూర్చుం
డిరి యొండోకు నని కానక
పరపురుష క్రియలఁ బ్రకృతి భావముకలదే.
అను నప్పకవి చేసిన యాక్షేప మతిసాహసం బని యధిక్షేపించుటయు సమంజసముగాదు. “నిత్య మనుత్తమ పురుష క్రియాస్వీతః"అను సూత్రమున కప్పకవి చేసిన వ్యాఖ్యా నానుసారముగా పై శ్రీనాథుని ప్రయోగము శాస్త్రవీరు ద్ధమే యగునుగదా. స్వరలక్ష ణసార సంగ్రహకారుఁడు సంగ్ర హించిన మధ్యమపురుష క్రియల ఇకారమునకుఁ బ్రకృతి . భావముకలిగిన రూపము రూపము బాలవ్యాకరణ కర్తకుఁ గాని