Jump to content

పుట:సంధి (ఆంధ్రభాషా సంధి నియమముల చారిత్రక పరిశీలనము).pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

108

సంధి

తేలఁగలదు. తరువాత నీ సంధి గలుగని రూపములు తక్కిన వానివలెఁ బ్రాచుర్యమును నహింపఁకుండుటకుఁ గల శార ణము నారయ వచ్చును. మఱియు భాషలోనున్న రూపము లెట్లెందుల కాయా రూపములు గలిగియున్నవో పరిశీలించి సకారణముగ సమర్థించుటయే భాషా చరిత్రకు ముఖ్యలక్ష ణముగాని 'తాత్కాలిక వ్యాకరణమునలే నిది సుశబ్దము, ఇది యపశబ్దము నని నిర్ణయించి యొకదాని నాదరించి యొక దానిని త్రోసిపుచ్చుట దాని లక్షణముకాదు, భాషాచరిత్రకు భాష లోని యర్థవంతములగు శబ్దములన్నియు లక్ష్యములే, ఒక దానియం దాదర భావము మఱియొక దానియం దనాదక భావము దానికిలేదు. కావున చారిత్రిక దృష్టితో నీ రూపము లను బరిశీలించుట యుక్తము.


ఈ పై క్రియారూపములన్నియు ధాతువునకుఁ జేర్పఁ బడిన కాలసూచక శబ్దములపై లేదా ప్రత్యయములపై సర్వ నామ శబ్దములనో ప్రత్యయములనో చేర్చుటచే నేర్పడినవనుట స్పష్టమే. కావున ని, మి, వి, రి అనునవి “(నే)ను, ' (మే)ము, (ఈ)వు, (ఈ) రు, (వా)రు,” అనువాని రూపాంతరములే యను టకు సం దేహము లేదు. ఇవి భవిష్యద్వ ర్తమానకాలిక రూపము లలో ఉకారాంతములుగనే యుండియు, భూతకాలిక క్రియా పదముల తుది నిక్షారాంతములగుటకు ముఖ్య కారణము భూత కాల చిహ్నము “జ్ఞ” కార యుక్తమై యుండుటయే యని తలఁపనగును, పో+ఇ(తు) + (ఈ)వు = పోయితు + ఈవు -