106
సంధి
ఇంక నిత్యముగా విధింపఁబడిన మధ్యను పురుష క్రియల సంధినిగూర్చి పరికింతము. ఏలితివి + అపుడు = ఏలితి నపుడు, ఏలితిరి + ఇపుడు = ఏలితిరిపుడు అని నిత్యసుధి కావ లసిన చేయని వైయాకరణులు విధించినారు. ఈ మధ్యమ పురుషే కార సంధిని గూర్చి వ్యాఖ్యానము చేయుచు గుప్తార్ద ప్రకాశికా కారుఁడు, దీనికి సంధి నిత్యము గావున, “ఏలితివి యిపుడు” అని చెప్పఁగూడదనియు, “ఇదేశమనాజ్ఞ ద్రోచి తిరి యెచ్చటనుండిట వచ్చినారలు” అని కవులషష్ఠములో నిదిగా స్వరలక్షణ సారసంగ్రహమునం దుదాహరింపఁబడినట్టి యడాగమముతోఁ గూడిన ప్రయోగము నిరాశరంబనియుఁ జెప్పియున్నాఁడు. వీరి మతమున ప్రథమోత్తమపురుషులలోని యికారమునకు సంధి వైకల్పికమే. వచ్చిరిపుడు — వచ్చిరి యిపుడు, వచ్చితిమిపుడు --వచ్చితిమి యిపుడు, అని రెండు రూపములునుండగా "త్రోచితిరి యెచ్చట" త్రోచితి రెచ్చట యని మధ్యమ పురుషలోఁగూడ రెండు రూపములున్న చో నాశ్చర్యమేమియు నగపడదు. అయితే భాషలోనున్న రూప ములను శీష్టులు కావ్యములఁ బ్రయోగించిన రూపములనే ప్రామాణీకరూపములుగా గ్రహింపవలెగాని, "నచ్చిరి యపుడు” అని యున్నది గావున “త్రోచితిరి యెచ్చట” అను రూపముగూడ నుండఁగూడదా యని వాదించినచో, నిం ననేక శబ్దముల విషయమునఁ గూడ నిట్టి వాదమే బయలు దేత్రం. టయు భాషకు నియమమే లేకుండుటయు దటస్థించుననియు