Jump to content

పుట:సంధి (ఆంధ్రభాషా సంధి నియమముల చారిత్రక పరిశీలనము).pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

14]

ఇకారసంధి

105

బ్రయోగింపఁగూడదని వ్యాకరణము శాసించును. ఈ భాష లో నీ 'Man' శబ్దములోని “ఆ” వంటి ధ్వనికి లిసి చిహ్న మింకను కల్పింపఁబడక పోవుట చేతనే చూశాను, వచ్చాను మొదలగు రూపములు - చెప్పంపఁడే, మఱ్ఱాకు శబ్దముల నలెనే - గ్రాంధిక భాషలోని కెక్కకపోవుట తటస్థించినది. ఇవి ప్రామాణిక రూపములుగా గ్రహింపఁబడకపోవుట యను కారణము వేఱండుండిన నుండుగాక. "చెప్పంపఁడే.” “అననలసంటి" మొదలగు నవి వ్యవహార బాహుళ్యమునుబట్టి గ్రంథములలోని కెక్కిన వేగాని, పూర్వవ్యాకరణ సమ్మత ములై ప్రామాణికత్వమును బడసినపిదపఁ బ్రయోగింపఁబడి నవి కావుగదా.

ఇట్లు మొ త్తముమీద నీ క్త్వార్థక సంధి వ్యవహారమునఁ కొన్ని సందర్భముల వాడికలో లేకపోలేదు. కాని యీ వాఙ్మయమునఁ జాల నూతనములగు మార్గములను ద్రొక్కి తమ స్వాతంత్ర్యమును వెల్లడించిన పింగళి సూరనార్యుఁడు మొదలగువారు కొందఱు వ్యవహార ప్రచురమైన రూపమును మన మెందులకుఁ బ్రయోగింపఁగూడదని తలంచి సాహసించి “చెప్పంపఁదే” యని "అనవలసంటిగాని" యని క్యార కేకార మునకు ఇకా రేతరమగు వచ్చుపరమైనపుడు సంధిచేసి ప్రయో గించినను, సామాన్యముగాఁ దక్కిన కవు లెవరును ప్రాచీన లక్షణమును మీఱుటకు సాహసింపలేదు. ఎట్లైనను క్త్వార్థకే కారసంధి ని షేధము కొంత కాలమునకు పాటింపఁబడకపోవుట. తటస్థించినదనియే చెప్పక తప్పదు.