ఆకృతి రచన- ఆధునిక నిర్మాణ ద్రవ్యములు
విషయమును తెలుపుచున్నవి. వీటిని నిర్మాణ ప్రయుక్తమైన ఉక్కు, దృఢీకృతమైన కాంక్రీటు అందురు. ఇదియే
ఆర్. సి. సి. అనబడును. సిమెంటు-కాంక్రీటునందు నిర్దిష్టమైన కైవారముగల మెత్తని ఉక్కు ఊచలు నిర్దిష్ట సంఖ్యలో చేర్చుటచే దానికి పటుత్వము కల్పింపబడును. దృఢీకృతమైన సిమెంటు-కాంక్రీటు స్తంభములు, దూలములు మొదలగు నిర్మాణాంగములకు ఉపయోగపడు చున్నది. ఉక్కును తయారుచేయు బెస్సిమర్ విధానము 1855 లో కనిపెట్టబడినది. పోతపోసిన ఉక్కు చువ్వలు తయారుచేయబడి, ఆధార స్తంభములుగను, దూలములుగను, ద్వార బంధములపై తొడుగు రాళ్ళుగను ఉపయోగపడుచున్నవి. ఉక్కు ఆధార స్తంభముల యొక్కయు, దూలముల యొక్కయు సహాయముతో
పెక్కు అంతస్తులు గల భవనములు కట్టబడుచున్నవి. ఇవి మిద్దెలు, గోడలు, ఇంటిపైకప్పులు మొదలైనవాని
భారమును మోయు ఆధార పంజరములుగా నున్నవి. ఇట్టి కట్టడములు ఆధార పంజర నిర్మాణములు (Framed-
Structure) అని పిలువబడుచున్నవి. అవి నిర్మాణ ప్రయుక్తమైన ఉక్కుతోగాని, దృఢీకృతమైన కాంక్రీటుతోగాని
నిర్మింపబడును. ఈ క్రొత్త నిర్మాణ ద్రవ్యముల యొక్క సంభావ్యతను గురించిన, ప్రప్రథమ ప్రయోగములు ఫ్రాన్సు దేశమున పారిస్ లో 1878-79 సంవత్సరములలోజరిగిన వస్తుప్రదర్శనములోను, విమానముల కొరకై 1916 లో నిర్మింపబడిన హాంగరు (Hanger) లోను చేయబడినవి. ద్వారముల వెడల్పు, స్తంభముల మధ్య దూరము, రాతితోను, కఱ్ఱతోను చేయబడిన దూలముల యొక్కయు, గొడుగురాళ్ళ యొక్కయు, నిడివిని బట్టియు, ఇటుకతో గాని, రాతితో గాని కట్టబడిన కమానుల మధ్యదూరమును బట్టియు, ఎల్లప్పుడు సరిచేయబడు చుండుట మనము చూచియేయున్నాము. ద్వారముల పరిమాణమును, ఆధార స్తంభముల దూరమును, నిర్ణయించుటలో ఈ దృఢీకృతమైన కాంక్రీటు నిర్మాణ
ప్రయుక్తమైన ఉక్కు, శిల్పులకు గొప్ప స్వేచ్ఛను కలిగించినవి. ఇదియే వాస్తుశాస్త్ర ప్రపంచములో గొప్ప మార్పును తెచ్చినది. విశాలములగు ద్వారములు, కిటికీలు సాధ్యమగుటవలన నిర్మాణాంగముల యొక్క ఆకృతి రచన అభివృద్ధి చెంది. విస్తరించుటకు అవకాశము కలిగినది. ద్వారములకు, కిటికీలకు జారుడు మడతతలుపులు ఉపయోగించుట వలన, పూర్తిగా గోడ అంతయు తెరచి యుంచుటకు వీలగుచున్నది. దృష్టినిరోధకములు గాని ఉక్కు తునుకలచేత నిర్మింపబడినవగుటచేత, ఈ కిటికిలు చక్కగా చూచుటకు అవకాశము కల్పించుచున్నవి.
గాజుపరిశ్రమ భవననిర్మాతలకు అనేక ఉపయుక్తము లయిన వస్తువులను ప్రసాదించినది. గోడలకు గాజుపలకలు. చపటాచేసిన నడప్రదేశములకు దీపములు, మున్నగు సుందరాలంకార నిర్మాణ ప్రయుక్తమైన గాజువస్తువులు వీనిలో కొన్నియని చెప్పవచ్చును. మిక్కిలి దృఢముగా చేయబడిన గాజుపలకలను కిటికీ తలుపులుగాను, ద్వార కవాటములు గను, ఇప్పుడుపయోగింపబడుచున్నవి. తెరచియున్నపుడు చూచుటకు చక్కని అవకాశమును కలిగించుచు, మూసి యున్నప్పుడు కన్ను చెదురు కాంతినుండి, అధికమైన రక్షణనిచ్చు పల్చని అల్యూమినియం తెరలు నేడు తయా రగుచున్నవి. ఎటువంటి కట్టె పై భాగపు గట్టితనమునకు తీసిపోనిపై, మన్నికగల తేలిక 'ప్లైవుడ్ ' బల్లలు నేడు లభ్యములగుచున్నవి. ఇవి చట్రములకు వెనుక అస్తరు పలకలుగా కూడ ఉపయోగపడును.
ఇదేవిధముగా తయారయిన దిమ్మపలకలు వేగముగా మూసి తెరచుకొను తలుపులవలె నుపయోగకరముగా నుండును. ఆరోగ్యపరికరములు, మురుగునీటి కాలువల ఏర్పాటు, మలవాహక విధానము, పరిశుభ్రమైన నీటిని పట్టణములో సరఫరాచేయు సౌకర్యములు మొదలైనవి భవననిర్మాణవిధానమునందు మార్పులు కలిగించి అతి ముఖ్యమైన అభివృద్ధిని గొని తెచ్చినవి. శబోష్ణములు ప్రసరింపకుండా చేయుటకు కావలసిన వివిధ నిర్మాణ ద్రవ్యములు, కట్టడములు కట్టువారికి ఇప్పుడు దొరకుచున్నవి. ఇవన్నియు, శిల్పులు తక్కువ ప్రతిబంధకములతో భవన నిర్మాణ విధానమును ఏర్పాటు చేయగలుగుటకు మిక్కిలి తోడ్పడుచున్నవి. కృత్రిమ పద్ధతులపై గాలిని. వెలుతురును ప్రసరింపజేయు నవకాశములు సాధ్యమగుటవలన, భవనముల ఆకృతిరచన చేయుటలో, శిల్పులకు మహ త్తరమైన స్వేచ్ఛయు, అవకాశమును లభించినవి. దుకాణములు, కర్మాగారములు, పాఠశాలలు, ఆసుపత్రులు, ఆరోగ్య