ఆంధ్రదేశ చరిత్రము - II
హెచ్చెను. ఉత్తర ఆర్కాటు జిల్లాలోని శంభూవరాయలను జయించుటలో నేమి, పశ్చిమ చాళుక్య చక్రవర్తుల సైన్యములను పారద్రోలుటలో నేమి, పాండ్యులను హత మార్చుటలో నేమి, నెల్లూరు తెలుగు చోళులు కీర్తిని
సంపాదించిరి,
1238 నుండి 1250 వరకు తిరిగి రాజేంద్ర చోళుని ప్రభ వెలిగెను, కాకతీయులతోడి స్నేహము తెలుగు చోళులకు లాభించెను. అయినను కొన్ని సంవత్సరములయిన తరువాత జటావర్మ సుందరపాండ్య గొప్పసేనను సమకూర్చుకొని గండగోపాల (తిక్క) నోడించి చంపెను. కంచి, నెల్లూరు మండలములు పాండ్యుల స్వాధీనమయ్యెను. కాకతి గణపతి ఓడి పరారయ్యెను. తిక్క 1239 నాటికే హోయసల రాజగు నరసింహు నోడించి కల్యాణిపురమును తగులబెట్టెను. దీనికి ప్రతీకారముగా 1240 లో నరసింహుని కొడుకగు సోమేశ్వరుడు నెల్లూరుపై దండెత్తెను. కాని ఓడిపోయెను. తిక్కనకవి, కేతనకవి కూడ కర్నాట సోమేశ్వరు డోడిపోయి పరారి అయినాడని వ్రాసిరి. తిరిగి 1257 లో తిక్కరాజు కంచిని స్వాధీన పరచుకొని సోమేశ్వరుని చంపాపురివద్ద ఓడించెను. ఇట్లే దేవగిరి యాదవులను ఓడించెను. వెలనాటి చోడ రాజగు పృథ్వీశ్వరుని ఓడించి చంపెను. శంభూవరాయ కాడవరాయ రాజులను ఓడించెను. వారినుండి కప్పము గైకొనెను. తన ఆఖరి రాజ్య కాలములో కొడుకగు మనుమసిద్ధి,అల్లుడగు అల్లు తిక్కలను తనతో కూడ పరిపాలించుటకు నియమించెను. తరువాత రాజ్యమును విభజించి అల్లుతిక్కకు కంచిరాజ్యమును, మనుమసిద్ధికి నెల్లూరు రాజ్యమును ఇచ్చెను. అల్లుతిక్క స్వతంత్ర రాజుగా తన పేరుతో శాసనములను ఇచ్చెను (1248- 1272).
1249 లో పాండ్యులు దండెత్తిరి. కాని కాకతీయుల సహాయమున అల్లుతిక్క వారిని కంచినుండి పారదోలెను. కాకతీయ గణపతి రుద్రమదేవులతో స్నేహముచేసెను. తెలుగు పల్లవరాజగు విజయగండ గోపాలునితో కూడ స్నేహము చేసెను. ఈ వంశములవారి శాసనములు కంచి యందు కలవు. మనుమసిద్ధి (1248-67) అనేక శాసనములు ప్రకటించెను. 1250 లో తనకు ఆరోగ్యము కలుగుటకు నందలూరిలోని దేవునికి దానధర్మములు చేసెను. ఈతడు మూడవ వీర రాజేంద్రచోళుని సామంతుడు. 1257 నందలూరు శాసనమునుబట్టి ఇతని వంశ క్రమము, ఇతని కోడూరు గ్రామ ధర్మము తెలియును. ఈతని 1258 సం. శాసనము నల్లసిద్ధికి, యాదవులకు జరిగిన యుద్ధమును తెలుపును. మనుమసిద్ధి రాజ్యాభివృద్ధికై తెలుగుపల్లపు లిచ్చిన దాన శాసనములు కొన్నిగలవు. ఈతని దాన శాసనములు కొన్ని కంచి యందుగలవు. 1265 నుండి తన కొడుకు రెండవతిక్కతోసహా పరిపాలించెను. కాకతీయ గణపతిదేవుని సహాయములో ఈతడు రాజ్యము చేసెనసి తెలియును. చోళరాజగు మూడవ రాజేంద్రుని ప్రభ తగ్గినను, ఈ తెలుగు చోళులు ఇంకను అతని సామంతులమని పేర్కొనుచుండిరి. ఈతని ఆఖరి రోజులలో 1250 సం. నుండి ఈతనికి, ఈతని దాయాదులకు జరిగిన పోరాటములో ఈతడు కాకతీయులను, వారు పాండ్యులను సహాయము కోరగా పాండ్యులు దండెత్తి నెల్లూరును పట్టుకొని ఈతనిని సింహాసనమునుండి తొలగించగా, కాకతీయులు వచ్చి తిరిగి పాండ్యులను పారదోలి అతని సింహాసన మతని కిప్పించిరి. ఈ సందర్భముననే తిక్కన సోమయాజి కాకతీయ గణపతిని ఓరుగల్లునందు సందర్శించి తనరాజునకు సహాయము కోరెను. గణపతి తిక్కన కవిత్వము విని ఆనందించి ఆతనికి 9 లక్షల బంగారు నాణెములను 68 గ్రామములను బహుమాన మిచ్చెను. గొప్ప సేనతో వెలనాడు దేశమును జయించి రాజధానిని (త్సందవోలును) తగులబెట్టి, నెల్లూరు ముట్టడించి, పట్టుకొని మనుమసిద్ధిని సింహాసనముపై నెక్కించెను. 24 దుర్గములు, 68 పట్టణములు పట్టుకొని మనుమసిద్ధికి కానుకగా నిచ్చెను. మనుమసిద్ధికి మన్మగండ గోపాల బిరుదముండెను. ఈతడు యాదవులతో పోరాడెను, ఈతని సేనాపతి ఖడ్గతిక్కన యుద్ధమున గెలిచెను. కాని చనిపోయెను. పెన్నానదీ తీరమందు సోమశిల వద్ద యుద్ధము జరిగెను. యాదవులు సామంతులుగా నుండిరి. ఇట్లే ఖడ్గతిక్కన తెలుగు పల్లవరాజగు విజయుని ప్రాయేరువద్ద ఓడించెను. విజయు పూర్తి పేరు విజయగండ గోపాలుడు. పెంట్రాల, కడప యందలి తెలుగు పల్లవులు మనుమసిద్ధి యధికారమునకు లోబడి