ఆంధ్రదేశ చరిత్రము _ II
(క్రీ. శ. 753 లో) రాష్ట్రకూటులు వీరి నోడించుచు వీరివల్ల కప్పములను గైకొనుచుండెడివారు.
విష్ణువర్ధనుని కొడుకగు నరేంద్ర మృగరాజ బిరుదాంకితు డగు రెండవ విజయాదిత్యుడు (క్రీ.శ. 807-846) క్రీ. శ. 834 నుండి 846 వరకు, అనగా అతని ఆఖరి 12 సం. లు రాష్ట్రకూటులతో 108 యుద్ధములు సలిపి, వారిని వారి సామంతులగు పశ్చిమ గాంగులను ఓడించి 108 శివాలయములను కట్టించెను.అనేక భూదానములను, అగ్రహారములను, వేదాధ్యయన సంపన్నులగు బ్రాహ్మణులకు, దేవాలయములకు, యుద్ధమున మడసిన వారి ఆత్మశాంతికిని, తాను చంపిన పాప పరిహారమునకును దాన మొసగెను, ఈతని తరువాత ఈతని కొడుకు 5 వ విష్ణువర్ధనుడు 1½ సంవత్సరములును, తరువాత ఆతని కొడుకు మూడవ విజయాదిత్యుడు 44 సంవత్సరములును రాజ్యము చేసిరి. (క్రీ.శ. 848-892) మూడవ విజయాదిత్యునే గణక విజయాదిత్యుడందురు. మూడవ విజయాదిత్యుని సేనాధిపతియగు పాండురంగడు ఈతని దానములకు కార్యకర్త గనుండెను. పాండురంగడు తన అద్దంకి దానశాసనమున 80 పుట్ల ధాన్యము చల్లుటకు వీలైన భూమిని ధర్మవరం ఆదిత్య (సూర్య) భట్టారక దేవునికి దానమిచ్చెను. ఈతడు బోయలకొండ కోటను స్వాధీనము చేసికొని వారి కొట్టములను (12 కొట్టముల భూమిని) జయించెను. ఈ గణక విజయాదిత్యుడు పూర్వ చాళుక్య రాజులలో కెల్ల సుప్రసిద్ధుడు. బహు పరాక్రమ శాలి. పరిపాలనలో కడు సమర్ధత గలవాడు. తన సేనాపతి పాండురంగని సహాయమున ఇతడు పెక్కు చిన్న చిన్న రాజ్యములను జయించెను. నెల్లూరును తగుల బెట్టెను. కందుకూరు కట్టెములను స్వాధీనము చేసి కొనుచు నోలంబ రాజగు మంగిని చంపెను. పశ్చిమగాంగులను ఓడించి తరిమెను. కన్నడ రాజును ఓడించి అతని స్నేహితుడు, దహలరాజగు సంకిలుని మానభంగ మొనర్చెను. వారి యొక్క కిరణ, అచల పురములను తగులబెట్టెను. పశ్చిమమున రాష్ట్రకూటులను, ఉత్తరమున కళింగ గాంగరాజులను ఓడించి కప్పముగై కొనెను. దక్షిణ కోసలముపై దండెత్తి చక్ర కొట్టమును కాల్చివేసెను. ఏనుగ గుంపులను గ్రహించెను. దక్షిణమున
పల్లవులను, పాండ్యులను ఓడించి వారినుండి బంగారము గైకొనెను. పంచమహాశబ్ద బిరుదమును వహించెను. కాని రాష్ట్రకూటుడగు అమోఘవర్షుని కాలమున ఆతనిచే ఓడింపబడి కప్పము గట్టెను. కాని అతడు చనిపోయిన తరువాత (888) అతని కొడుకు కృష్ణుని ఓడించి గణక విజయాదిత్యుడు సర్వదక్షిణాపథ రాజ్యమును త్రికళింగ సహితముగా జయించి పరిపాలించెను. పాండురంగ సేనాధిపతి కళింగ గాంగులను ఓడించిన తరువాత వేములవాడ, బస్తరు రాజ్యములను గ్రహించి, బద్దెగరాజుని సామంతునిగా జేసికొని, దహల, కిరణ, నిరాత, అచల, దళెపురములను పట్టుకొని తగులబెట్టి రాష్ట్రకూట రాజగు కృష్ణుని, అతని సహాయులను, సామంతులుగా జేసెను. ఈ రాజు కాలమున అనేక అగ్రహారములు బ్రాహ్మణులకు, దేవాలయములకు, మంత్రులకు, సేనాధిపతులకు ఇవ్వబడెను. చాళుక్య రాజ్యము ఉన్నత స్థితికి పెరిగెను.
ఈతని అద్దంకి శాసనమున ఈ క్రింది తరువోజ వృత్తము (శాసనములలో దొరికిన మొదటి తెలుగు పద్యము) కలదు. జయసింహుని (641-673) విప్పర్తి శాసనముగూడ ప్రాచీన తెలుగుభాష యం దున్నది. గద్యమయము. తూర్పుచాళుక్య రాజులందరు తెనుగుననే దానశాసనములను వ్రాయించిరి.
"స్వస్తిశ్రీమత్ సకల లోకాశ్రయ జయసింఘ |
వల్లభమహారాజులకున్ ప్రవర్ధమాన విజయ రా !
జ్య సంవత్సరంబుల్ ఎణుంబోది అన్నేణ్ణి అమ్మన్ పూణ్ణ|
మనాణ్డుం మ్లానిండి రాజుల ముట్ళు- కలిముడి రాజుల్-
క్రీ. శ. 9వ శతాబ్దమునాటికి పద్యమయశాసనము లేర్పడినవి. ఈతని శాసనము వలనను, వేములవాడ చాళుక్యుల శాసనములవలనను పంపకవి యొక్క విక్రమార్జున విజయము వలనను ఈతని చరిత్ర తెలియుచున్నది.
గణక విజయాదిత్యుని తరువాత ఆతని తమ్ముని కొడుకు మొదటి చాళుక్య భీముడు 892 నుండి 921 వరకు రాజ్య మేలెను. ఈతని అత్తిలి తామ్ర శాసనమున ఈతడు శకసంవత్సరము 814 (క్రీ. శ. 892 ఏప్రిల్ 17) మేష చైత్ర బహుళ తదియ సోమవారమునాడు పట్టాభిషిక్తు డయినట్లు కలదు. తెలుగు దేశమున శకాబ్ద