పుట:షహీద్-యే-ఆజం అష్ఫాఖుల్లా ఖాన్.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

అష్పాఖుల్లా ఖాన్‌ ఉరిశిక్ష∆కు సరిగ్గా ముందురోజున అనగా డిసెంబర్‌ 18వ తేదీన ప్రతాప్‌ పత్రిక సంపాదకులు గణేష్‌ శంకర్‌ విద్యార్థికి ఒక టెలిగ్రాం పంపారు. ఆ టెలిగ్రాంలో, డిసెంబర్‌ 19 మధ్యాహ్నం రెండు గంటలకు నన్నులక్నో రైల్వేస్టేషన్‌లో కలవండి. మీరు నన్ను చివరిసారిగా కలుస్తారని ఆశిస్తాను., అని కోరారు. ఆ ప్రకారంగా శ్రీ విద్యార్థి తొమ్మిది మంది మిత్రుల్ని తీసుకుని ఆ రోజున లక్నో స్టేషన్‌కు వెళ్ళారు.

అమర యోధుడు అష్పాఖుల్లా ఖాన్‌ భౌతికాయాన్ని తీసుకొచ్చిన రైలు లక్నో స్టేషన్‌ చేరుకుంది. అష్పాఖ్‌ భౌతికకాయం ఓ రైలు కంపార్టుమెంటులో ఉంచబడి ఉంది. ఆ కంపార్ట్‌మ్‌ెంలోకి శ్రీ విద్యార్థి తదితరులు ఎక్కి అష్పాఖ్‌ భౌతికకాయం మీద ఉన్న వస్త్రాన్నితొలిగించారు. ఆయన ముఖం ప్రశాంతంగా, కళగా ఉంది. ఆయనను ఉరితీసి పదిగంటలైనా ముఖం కళగానే ఉంది. ఆయన గడ్డం బాగా పెరిగి ఉంది. ఆయన శరీరం శుభ్రంగా ఉంది. ఆయన ఉరితాడ్రును చిరునవ్వుతో స్వీకరించిన కారణంగా కాబోలు ఆయన ముఖంలో చిరునవ్వులు ఉట్టిపడుతున్నాయి. ఆయన ప్రశాంతంగా నిద్రాపోతున్నట్టు, ముఖం మీదఎంతో ప్రశాంతత నెలకొని ఉంది. ఇది అంతిమ నిద్ర. అనంతమైన నిద్ర. మరెన్నడూ మేల్కొనని సుదీర్గ… నిద్రలో ఆయన ఉన్నారా? అనిపించేలా ఉంది.

అఫ్పాఖుల్లా ఖాన్‌ భౌతికకాయాన్ని షాజహాన్‌పూర్‌ తీసుకు వెళ్ళారు. అష్పాఖ్‌ కోరిన విధంగా ఆయన భౌతికాయాన్నిసమాధి చేసారు. అంత్యక్రియలకు ప్రజలు పెద్ద

70