పుట:షహీద్-యే-ఆజం అష్ఫాఖుల్లా ఖాన్.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

షహీద్‌ - యే - ఆజమ్‌ అష్పాఖుల్లా ఖాన్‌

బిస్మిల్‌ చివరి సందేశాన్ని విద్రోహి కలం పేరుతో సర్దార్‌ భగత్‌సింగ్ 1928 నాటి కీర్తి పత్రికలో ఇదే విషయాన్నిప్రస్తావిస్తూ, నేను చెబుతున్నట్టుగానే, అష్పాఖుల్లా ఆలోచనలూ ఉన్నాయి. అప్పీలు రాసున్నప్పుడు లక్నొ జైలులో నేను అతనితో మాట్లాడాను. ప్రభుత్వానికి దయాభిక్షపత్రం సమర్పించటం తనకు ఎంత మాత్రమూ యిష్టం లేదు. నేను బలవంతం చేయటం వల్ల, నా మాటను కొట్టెయ్యలేక చివరికి అష్పాఖుల్లా అంగీకరించాడు, (జ్ఞాపకం చేసుకోండి ఎప్పుడైనా: పేజి.28 మరియు 40) అని బిస్మిల్‌ చెప్పినట్టుగా రాసారు.

ప్రజల వేడు కోళ్ళు ప్రబుత్వాన్నికదిలించలకపోయాయి. ప్రజా నాయకుల వినతులు బుట్టదాఖలయ్యాయి. ఆ క్షమాభిక్ష విజ్ఞప్తులు తిరస్కరించబడ్డాయి. చివరకు ప్రధాన కేసులోగాని, అనుబంధ కసులోగాని విచారణ ఎదుర్కొన్న కాకోరి యోధులలో నలుగురికి ఉరిశిక్షలు ఖరారయ్యాయి. అష్పాఖుల్లా ఖాన్‌ను 1927 డిసెంబరు 19వ తేదీన పైజాబాద్‌ జైలులో ఉరితీయాలని కోర్టు ఆదేశించింది. ఆ ఆదేశాల ప్రకారంగా అష్పాఖుల్లా ఖాన్‌ను లక్నో కారాగారం నుండి ఫైజాబాద్‌ జైలుకు తరలించారు.

మాతృదేశం కోసం ప్రాణాలర్పించేందుకు సంసిద్దుడైన అష్పాఖ్‌ ఏనాడు మృత్యువుకు భయ పడలేదు . చిన్న వయస్సులోనే మాతృదేశ సేవకు తనను తాను అంకితం చేసుకున్న ఆయన తనను భారతమాత సేవకునిగా చెప్పుకున్నారు. తన ప్రాణాలు భారతమాతకు అర్పితమని కూడా ఆయన మిత్రులకు, సన్నిహితులకు రాసుకున్న లేఖలలో పేర్కొన్నారు. అనునిత్యం చస్తూ పిరికితనంతో బ్రతకడం ఆయనకు ఇష్టం లేదు. ఈ భావాన్నిఆయన రాసిన కవితలో వ్యక్తం చేసారు. చివరికి ఉరివేదిక మీద కూడా తన నిర్భీతిని, భావోద్వేగాలను ఉర్దూ కవితల ద్వారా వెల్లడించారు. ఆయన బంధు మిత్రులకు రాసిన లేఖలలో భావోద్వేగాలను చక్కని ఉర్దూ కవితల ద్వారా అష్షాఖ్‌ వెల్లడించారు. బంధుమిత్రులకు రాసిన లేఖలలో, వారితో జరిగిన సంభాణలలో తనకు మరణ భయం ఏమాత్రం లేదని పేర్కొన్నారు. మాతృదేశం కోసం మృత్యుమాలను ధరించేందుకు తాను సిద్దాంగా ఉన్నాని, అంతటి మహాద్భాగ్యం తనకు దక్కినందుకు గర్వపడుతున్నానని అష్పాఖుల్లా ఖాన్‌ పలు లేఖలలో పేర్కొన్నారు.

ఉరిశిక్ష అమలు కోసం ఎదురుచూస్తూ ఫైజాబాదు జైలులో ఉన్న సమయంలో ఆయన తల్లికి రాసిన లేఖలో మరణమంటే ఖాతరు చేయనని నిర్భయాన్ని వెల్లడించారు.

61