పుట:షహీద్-యే-ఆజం అష్ఫాఖుల్లా ఖాన్.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

మాతృదేశం కోసం ప్రాణాలర్పించటం అదృష్టంగా భావిసున్నానని, ఆ అవకాశం తనకు దక్కినందుకు దేవునికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని సహచరులతో అన్నారు. ఉరిశిక్షను దైవప్రసాదితంగా అష్పాఖుల్లా ఖాన్‌ భావించినందున, చక్రవర్తికి క్షమాభిక్ష పెట్టుకోడానికి ససేమిరా అంగీకరించ లేదు. మిత్రుడు బిస్మిల్‌ ఊరుకోలేదు. అష్పాఖ్‌ మీద ఒత్తిడి తెచ్చాడు. చివరకు అష్పాఖ్‌ అయిష్టంగానే క్షమాభిక్ష పత్రం పంపారు. ఈ విధంగా అష్పాఖ్‌ మీద ఒత్తిడి తెచ్చి, ఆయన ఇష్టానికి వ్యతిరేకంగా, ఆయన చేత క్షమాబిక్ష అభ్యర్థన పత్రం పంపించినందుకు, ఆ తరువాత బిస్మిల్‌ తన పశ్చాత్తాపం ప్రకటించారు.

ఈ విషయాన్ని తాను రాసుకున్న ఆత్మకథలో బిస్మిల్‌ ప్రస్తావిస్తూ, అష్పాఖుల్లా ఖానైతే బ్రిటిష్‌ ప్రబుత్వాన్ని కమాభిక్షయాచించేందుకు సమ్మతించలదు. దయామయుడైన ఆ దేవుని తప్పించి మరో వ్యక్తినెవరినీ క్షమాభిక్ష కోరరాదని ఆయన అచంచల విశ్వాసం. కానీ నేను మరీ పట్టుబట్టడంతో ఆయన కూడాక్షమాభిక్ష కోరాడు. నా పవిత్ర ప్రేమ ప్రసాదించిన అధికారాల్నివినియోగించి నేను అష్పాఖుల్లా ఖాన్‌ను తన దాఢనిశ్చయం నుండి విచలితుడయ్యేలా చేశాను. గనుక దీని దోషమంతా నాదే... గోరక్‌పూర్‌ జైలు నుండి అష్పాఖుల్లా ఖాన్‌కు నేనొక లేఖ రాసి నన్ను క్షమించాల్సిందిగా కోరాను, అన్నాడు. (బిస్మిల్‌ ఆత్మకథ: పేజి. 137)

60