పుట:షహీద్-యే-ఆజం అష్ఫాఖుల్లా ఖాన్.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

షహీద్‌ - యే - ఆజమ్‌ అష్పాఖుల్లా ఖాన్‌

పడ్డాక, ప్రీవీకౌన్సిల్‌కు అప్పీలు చేసుకోవటం ఆయనకు ఇష్టం లేకున్నా శ్రీ బిస్మిల్‌ కోరిక మేరకు సరేనన్నారు.

అష్పాఖ్‌ అంతటి తో సరిపెట్టుకోలేదు. కాకోరి సంఘటనకు తనను తాను ప్రదాన బాద్యుడిగా పేర్కొంటూ, నేరభారాన్ని,భాధ్యతను పూర్తిగా తాను స్వీకరిస్తూ, స్వయంగా న్యాయస్థానానికి అప్పీల్‌ దరఖాస్తును పంపారు. ఆ దరఖాస్తుకు ఆయన న్యాయవాది స్వయంగా అభ్యంతరం పెట్టారు. ఆ సందర్బంగా, మీరు మీరు చేయని నేరాలను ఎందుకు అంగీకరిస్తున్నారు? అని ప్రశ్నించిన న్యాయవాది శ్రీ హజేలాకు నచ్చ చెబుతూ, నేను ఎల్లప్పుడు సిపాయిని మాత్రమే. రాంప్రసాద్‌ మా నాయకుడు. ఆయన నిష్టగల దేశబక్తుడు. మంచి తెలివితేటలు గల వ్యకి. నా ప్రాణాలు ఆడ్డువేసి ఆయనను రక్షించుకో

గలిగితే అది మా పార్టీకి, మా లక్ష్యాల సాధనకు ఎంతో మంచిదౌతుంది. నేను సిపాయిని

మాత్రమే . ఆయన ఆలోచనలు తీరుతెన్నుల విషయంలో నేను సరితూగలేను. ఆందువలన ఆయనను రక్షించుకోవాల్సి ఉంది, అని అష్పాఖుల్లా ఆన్నారు.(Sudhir Vidhyadhi Page.86)

చివరకు ఆ అభ్యర్థన పత్రం వలన శిkshaమాఫి సంగతి ఎలాగుnnaa, శిక్ష మరింత బలపడుతుందని న్యాయవాది చెప్పినప్పటికీ వినకుండా, ఆ దారఖాస్తు పత్రాన్ని ఉన్నత న్యాయస్థానానికి పంపుకున్నారు. ఓ సమర్ధుడైన నాయకుడ్ని రక్షించుకుంటే ఉద్యమం సజీవంగాఉంటుందన్న నమ్మకంతో, ఆ నేతకు బదులు తాను శిక్షలకు సిధపడిన అష్షాక్ కు విప్లవోద్యమం పట్ల ఉన్న నిబద్దత, త్యాగశీలత పండిత బిస్మిల్‌ పట్ల ఉన్న గౌరవం ఈ చర్య ద్వారా బహిర్గతమయ్యాయి.

ప్రజల, ప్రజాప్రతినిధుల విజ్ఞపులు అన్ని స్థాయిలలో తిరస్క రించబడ్డాక, చివరకు క్షమాభిక్ష పత్రాన్నిపంపేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఉరిశిక్షలు పడిన వారంతా కమాభిక్ష కోరుతూ వినతి పత్రాలు పంపుతున్నారు. అష్పాఖ్‌ మాత్రం కమాభిక్ష కోరడానికి అంగీకరించలేదు. దేవుని మీద అపార విశ్వాసం గల అష్పాఖ్‌ ప్రతిదీ దేవుని ఇచ్ఛానుసారంగా జరుగుతుందని, దేవుడు తన పాత్రను ముగించదలిచాడని, ఆ కారణంగానే తనకు ఉరిశిక్ష పడిందని, అందువలన ఆ శిక్షను స్వీకరించడానికి తాను సిద్ధాంగా ఉన్నానని బంధుమిత్రులకు రాసిన లేఖలో వివరంగా పేర్కొన్నారు.

59