పుట:షహీద్-యే-ఆజం అష్ఫాఖుల్లా ఖాన్.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

షహీద్‌ - యే - ఆజమ్‌ అష్పాఖుల్లా ఖాన్‌

గౌరవాభిమానాలను గమనించిన ఆ సీనియర్‌ న్యాయవాదికి నోట మాట రాలేదు. ఆయన తన మనస్సులోనే ఆ విప్లవకారుడ్ని అభినందిస్తూ, అక్కడి నుండి తప్పుకున్నారు.

ఈ విషయాన్ని ఆష్పాఖ్‌ తన తల్లికి రాసిన ఒక ఉత్తరంలో ప్రస్తావిస్తూ, తాను అప్రూవర్‌గా మారి తన ప్రాణాలను కాపాడుకుని చరిత్రహీనుడ్నికాదలచుకోలేదని, తాను రానున్న తరాలకు ఆదర్శంగా నిలవాలనుకుంటున్నానని పేర్కొన్నారు. ఈ మేరకు తల్లికి రాసిన లేఖలో, నేను అప్రూవర్‌గా మారవచ్చు... నేరం కూడా అంగీకరించవచ్చు... అయితే తన కోసం ఇతరులను బలితీసుకునే వ్యక్తి భవిష్యత్తు తరాలకు ఎంతవరకు ఆదర్శం కాగలడా? ఎన్నటికీ కాలేడు,(Shaheed Asfaqulla Khan Aur Unka Yug, by Sudhir Vidyardhi.Page.101) అన్నారు. తన ప్రాణాల రక్షించుకోడానికి తాను అప్రూవర్‌గా మారి ఇతరుల ప్రాణాలను బలిపెట్టదలచుకోలేదని, తన తల్లికి అష్పాఖ్‌ తెలిపారు.

బిస్మిల్‌ కోసం ప్రాణ త్యాగానికి సిద్ధం

కాకోరి రైలు దోపిడికి సంబంధించిన ప్రధాన కేసు విచారణ పూర్తయ్యింది. న్యాయస్థానం శిక్షలు ప్రకటించింది. అష్పాఖ్‌, శచీంద్ర బక్షీల మీద నమోదైన అనుబంధ కేసు విచారణ ఆరంభమైంది. ప్రధాన కేసులో అష్పాఖ్‌, బక్షీల పాత్రకు సంబంధించిన అన్ని వివరాలు విస్తారంగా ప్రస్తావనకు రావటంతో, అనుబంధ కేసు విచారణ ఒక తంతుగా ఆరంభమైంది. ప్రముఖ విప్లవకారుడు చంద్రశేఖర ఆజాద్‌ను అరెస్టు చేయలేక పోవటం వలన ఆయన మీద కేసు పెండింగ్ ఉండి పోయింది.

ప్రధాన కేసులో దాదాపు నిందితులందరికి కఠిన శిక్షలను విధించినందున ఆ తీర్పులకు వ్యతిరేకంగా ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. సభలు, సమావేశాలు, ఊరేగింపులు నిర్వహించారు. ఉరిశిక్షలను రద్దు చేయాల్సిందిగా కోరుతూ ప్రభుత్వానికి వినతులు వెళ్ళాయి. ప్రజాప్రతినిదులు విజ్ఞప్తులు చేసారు. విజ్ఞప్తులను తిరస్కరించడం జరిగింది. అప్పీళ్ళను త్రోసిపు చ్చారు. విప్లవకారులందరికి శిక్షలు ఖరారయ్యాయి. అప్పీళ్ళ వ్యవహారం అంతా క్రింది స్థాయిలో పూర్తయ్యింది. ప్రీవీకౌన్సిల్‌కు అప్పీలు చేసుకోవడం మాత్రమే చివరకు మిగిలుంది.

ఈ విషయం చర్చించడానికి అష్పాఖుల్లా న్యాయవాది, ప్రముఖ ఆర్యసమాజం నాయకుడు శ్రీ కృపాశంకర్‌ హజేలా జైలుకు వచ్చారు. ఆయనకు అష్పాఖ్‌ అప్పటికే

57