పుట:షహీద్-యే-ఆజం అష్ఫాఖుల్లా ఖాన్.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

అయినా పోలీసు అధికారులు తమ నక్కజిత్తులను మానలేదు. అష్పాఖ్‌ ను లొంగదీసుకునేందుకు ఆయన న్యాయవాది శ్రీ కృపాశంకర హజేలా ను కూడ ప్రయోగించారు. ఆయన ద్వారా కూడా అష్పాఖ్‌కు చెప్పించి చూశారు. ప్రధాన కేసులోని విప్లవకారులకు భయంకర శిక్షలు పడ్డాయి కనుక, ఆ శిక్షలను ఉదాహరిస్తూ, అష్పాఖ్‌కు కూడా ఉరిశిక్షపడొచ్చు కనుక, పోలీసులకు సహకరిస్తే, ఉరి శిక్ష నుండి ఆయనను రక్షించవచ్చని ఖాన్‌ బహద్దూర్‌ తస్సద్దిఖ్‌ హుస్సేన్‌, అష్పాఖ్‌ న్యాయవాది శ్రీ కృపాశంకర్‌ హజేలాకు సలహ ఇచ్చాడు. ఆసలహా న్యాయవాదికి నచ్చింది. అష్పాఖుల్లా న్యాయవాదిగా ఆయనను రక్షించటం తన బాధ్యతగా భావించిన శ్రీ కృపాశంకర హజేలా తన వంతు ప్రయత్నం చేశారు.

ప్రధాన కేసులోని తీర్పులో అష్పాఖ్‌ గురించి న్యాయమూర్తి చేసిన ప్రస్తావనలను బట్టి, అష్పాఖ్‌కు ఉరిశిక్షతప్పదని భావించి భయపడిన న్యాయవాది శ్రీ కృపాశంకర్‌, అష్పాఖ్‌ను కనీసం ఉరిశిక్ష నుంచి తప్పించవచ్చన్న అభిప్రాయంతో పోలీసుల ప్రతిపాదనను అష్పాఖ్‌ ముందుంచారు. న్యాయవాది మాటలను పూర్తిగా విన్నాక, అష్పాఖ్‌ నవ్వుతూ, హజేలా సాబ్‌, నన్ను ఉరి శిక్ష నుండి తప్పించగలనా? అను భయంతో మీలాంటి వ్యక్తి కూడాపశ్చాత్తాపం ప్రకటించమని నాకు సలహా ఇస్తారని నేను అనుకోలేదు. అది అసంభవం. నేను చేసింది ఒప్పుకాని, తప్పు కాని నా దేశానికి స్వరాజ్యం సంపాదించా లన్నప్రగాఢమైన కోరికతో చేసాను. అందువలన పశ్చాత్తాపం చెందాల్సిన అవసరం ఏమీ లేదు. నేను స్వదేశీయుల గృహాలలో దోపిడి చేసే విషయంలో బిచ్‌పూర్‌ సంఘటన నుండి, శ్రీ రాంప్రసాద్‌ బిస్మిల్‌తో విభేదిస్తూనే ఉన్నాను. అయితే కాకోరి సంఘటనను ఆ ఘటనలతో జోడించలేం. దీనిని మేం మా లక్ష్య సాధన కోసం ఒక మార్గమని భావిస్తున్నాం. భారత జాతీయ కాంగ్రెస్‌ ఎలాగైతే లక్ష్యసాధానకు తన మార్గాన్నినిర్దేశిం చుకుందో అలాగే మేమూ దేశ స్వాతంత్య్రం కోసం మా మార్గాన్ని ఏర్పరుచుకున్నాం. ఈ మార్గం కంటకప్రాయమైనప్పటికి, ఈనాడు దేశం కోసం ప్రాణాలు అర్పించాల్సిన పరిస్థితి చాలా ఉంది. ఇక నేరం అంగీకరించటం అంటారా? నా వరకు నేను నేరం అంగీకరించడానికి సిద్ధామే కాదు, అందరి నేరాలను నా నెత్తిన వేసుకోడానికి కూడా సిద్ధం, (Shaheed Afsaqulla Khan Aur Unka yug, by Sudhir Vidyardhi. Page.85). అని అష్పాఖ్‌ ఆnnaaరు.

ఆ విధMగా 27 సంవత్సరాల యువకుడు అష్పాఖ్‌ చెప్పటంతో శ్రీ కృపా శంకరకు దు:ఖం ఆగలేదు. అష్పాఖ్‌ దేశభక్తిని, విప్లవోద్యమ నిబద్ధతను, సహచరుల పట్ల ఉన్న

56