పుట:షహీద్-యే-ఆజం అష్ఫాఖుల్లా ఖాన్.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

షహీద్‌ - యే - ఆజమ్‌ అష్పాఖుల్లా ఖాన్‌

రష్యా వెళ్ళాలన్నప్రయత్నం

అజ్ఞాతవాసం గడుపుతున్న అష్పాఖుల్లాకు డాల్టన్ గంజ్‌

చాలా సురక్షితంగా, సౌకర్య వంతంగా ఉంది. ఆయన ఆక్కడ కవిగా కూడా గుర్తింపు పొందారు. మంచి వర్కర్‌గా కూడా యజమాని ఆదరణకు పాత్రులయ్యారు. ఆయనను ఎవ్వరూ గుర్తుపట్టలేని పరిస్థితి. పోలీసుల భయం ఏమాత్రం లేదు. మంచి యజమాని, మంచి ప్రజలు. మంచి సాహితీ వాతా వరణం. ఆ ప్రాంతం అన్ని విధాల అనుకూలంగా ఉన్నా ఆయనలోని విప్లవకారునికి ఇవేమీ నచ్చలేదు.సౌకర్యవంత మైన విశ్రాంతి విసుగు అన్పించసాగింది. ఎనిమిది మాసాలు గడిపిన ఆయన ఇంకా అక్కడ ఉండలేక డాల్డన్‌గంజ్‌ వదలివేయాలని నిర్ణయించుకున్నారు.

అష్పాఖ్‌ అజ్ఞాతంలో ఉన్నప్పుడు ఆయనకు పంజాబ్‌ ప్రాంతానికి చెందిన ప్రసిద్ధ విప్లవకారుడు శ్రీ లాలా కేదారనాధ్‌తో పరిచయం అయ్యింది. ఆయన ఒకసారి మ్లాడుతూ, విప్లవకారులు కనుక బ్రిటిషు పోలీసుల కన్నుగప్పి సరిహద్దులు దాటి తప్పించుకోవాలంటే, తాను వారికి సహయపడగలనని చెప్పి ఉన్నారు. అష్పాఖ్‌ బీహర్‌ వదలి బయటకు వచ్చి, రష్యా వెళ్లాలన్న ఆలోచన రాగానే ఆయనకు శ్రీ కేదారనాధ్‌ గుర్తుకు వచ్చారు. ఆ ఆలోచనలకు కార్యరూపం కల్పించేందుకు అష్పాఖ్‌ కాన్పూరు వచ్చారు. కాన్పూరులో శ్రీ గణేష్‌ శంకర్‌ విద్యార్థిని కలిసారు. విదేశాలకు వెళ్ళాలన్న ఆలోచనను ఆయనకు తెలిపారు. శ్రీ విద్యార్థి మూడు వందల రూపాయలను అష్పాఖ్‌కు ఇచ్చారు.

అక్టోబరు విప్లవం ద్వారా రష్యా ప్రజలు సాధించిన విజయాలను స్వయంగా చూడాలని అష్పాఖ్‌ ఆకాంక్షించారు. ఆ కలలను పండించుకునేందుకు రష్యా వెళ్ళటానికి సిద్ద మయ్యారు. రష్యా ప్రయాణం ప్రయత్నాలు ప్రారంభించారు. ఆ ఏర్పాట్లు చేసుకోవడానికి అష్పాఖుల్లా డిల్లీ వెళ్ళారు. ఢల్లీ చేరుకున్న ఆయనకు కమ్యూనిస్టు నాయకుడు శ్రీ యస్‌.వి. ఘాటేతో పరిచయమయ్యిందని, ప్రముఖ రచయిత శాంతిమోయ్‌రాయ్‌ తన పుస్తకం ఫ్రీడమ్ మూవ్‌మెంట్ అండ్‌ ఇండియన్‌ ముస్లింస్ లో రాసారు. శ్రీఘాటే నుంచి మార్క్సిజం, రష్యా ప్రజల విజయాల గురించి మరిన్ని వివరాలను అష్పాఖ్‌ తెలుసుకున్నారు.

51