పుట:షహీద్-యే-ఆజం అష్ఫాఖుల్లా ఖాన్.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

రైల్వే స్టేషన్‌ దాటినాక విప్లవయోధులు రైలు చైను లాగారు. బండి ఆగింది. పదిమంది విప్లవకారులు బండి దిగి, తాము విప్లవకారులమని, ప్రయాణీకులకు ఎటువంటి హానీ చేయమని, రైలులో ఉన్న ప్రభుత్వ ఖజానాను దోచుకుంటున్నామని, ఎక్కడి వారక్కడ రైలు బోగీలలో కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేసారు. గార్డును పిస్తోలుతో భయ పెట్టి ప్రబుత్వ ఖజానా గల ఇనుప పెట్టెను అతికక్ష్టంమీద కిందికి దించారు. ఈ పెట్టె చాలా పటిష్టంగా ఉండడంతో మూతను తీయడం కూడా సాధ్యం కాలేదు. పెట్టె మూతను కోసి తొలగించ డానికి ప్రయత్నించినా వీలుకాలేదు.

ఆ పరిస్థితిని గమనించిన అష్పాఖ్‌ తన వద్దఉన్న మౌజర్‌ పిస్తోలును పక్కన ఉన్న సహచరుడికి ఇచ్చి చాలా బరువైన సుత్తి తీసుకుని ఐరన్‌ చెస్టును బద్దలు కొట్టసాగారు. సింహబలుడైన అష్పాఖ్‌ దెబ్బలకు ఐరన్‌ చెస్టు బద్దలయ్యింది. ఆ విధంగా పలగులగొట్టిన ఐరన్‌ చెస్టు నుండి డబ్బు మూటను బయటకు తీసి దుప్పట్లోవేసుకున్నారు. ఈ విధంగా కాకోరి రైలు దోపిడీ సంఘటనగా స్వాతంత్య్ర సంగ్రామ చరిత్రలో చోటుచేసు కున్న సాహసోపేత చర్యను నిముషాల్లో పూర్తిచేసుకుని విప్లవకారులు సంఘటనా స్థలం నుండి నిష్క్రమించారు.

అష్పాఖుల్లా తన నిర్ణయాలను ప్రకటించటంలో ఎంత స్పష్టంగా ఉంటారో, ప్రజాస్వామ్యబద్దంగా తీసుకున్న మెజారిటీ నిర్ణయాన్నికూడా అంతగా గౌరవించి పాటించటం ఆయనకు ప్రజాస్వామం పట్లగల గౌరవానికి చిహ్నం. ఈ విషయాన్ని మరో విప్లవకారుడు, అప్పాఖుల్లా సహచరుడు శ్రీశచీంద్రనాధ్‌ బక్షీ ప్రస్తావిస్తూ, చివరకు ఎలాగైతేనే అతి కష్టం మీద అష్పాఖుల్లా ఖాన్‌ ఐరన్‌ చెస్ట్‌ని బద్దలు గొట్టాడు. దొపిడీ మొదలెట్టడానికి ముందు ఈ యాక్షన్‌ని నిరసిస్తూ వచ్చిన అష్పాఖ్‌, దోపిడి ప్రారంభం కాగానే, దానికి పూర్తి సహకారం అందించేడు, అని ఆనాటి సంఘటన వివరాలు తెలిపారు. (ప్రజా సాహితి, మాసపత్రిక, డిసెంబరు 2000, పేజి. 28)

విప్లకారుల మీద విరుచుకుపడ్డ ప్రభుత్వం

ఈ కాకోరి రైలు దోపిడి సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బ్రిటిష్‌ ప్రభుత్వం ఖంగుతింది. పోలీసు వ్యవస్థ ఉలిక్కిపడింది. ప్రభుత్వ ఖజానాను దోపిడు చేయడం, అది కూడ ఒక రైలులో తరలిస్తున్నసోత్తును కన్నుతెరిచి కన్నుమూసేలోగా విప్లవకారుల దళం ఎత్తుకెళ్ళడాన్ని ప్రబుత్వం జీర్ణం చేసు కోలేకపోయింది. ఈ సంచలనాత్మక సంఘటనకు కారకు లైన వారి పట్ల అత్యంత కరినంగా వ్యవహరించాలని నిర్ణయించింది.

42