పుట:షహీద్-యే-ఆజం అష్ఫాఖుల్లా ఖాన్.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

షహీద్‌ - యే - ఆజమ్‌ అష్పాఖుల్లా ఖాన్‌

తన అభిప్రాయాన్ని యాక్షన్‌ కోసం బయలు దేరిన లక్ష్వత రైలు లక్నో వచ్చే దాక చెబుతూనే ఉన్నారు. చివరకు కాకోరి రైల్వే స్టేషన్‌ చేరుకున్న తర్వాత కూడా ఆయన రాంప్రసాద్‌ బిస్మిల్‌తో, నామాట విను రామ్‌, ఇప్పికీ మించిపోయింది లేదు. పద వెనక్కి తిరిగిపోదాం. ఈ యాక్షన్‌ జరగకూడదు. ఈ ప్రయత్నం మనకు నష్టదాయకం కాగలదు సుమా, అంటూ చివరి వరకు మొత్తుకున్నారు. చరిత్ర సృష్టించిన కాకోరి రైలు దొపిడి

ప్రభుత్వ ఖజానాను దోపిడు చేయడానికి పథకం సిద్ధమైంది. విప్లవ దళంలోని సభ్యులకు బాధ్యతలు అప్పగించారు. ఈ యాక్షన్‌లో పాల్గొనేందుకు 10 మందితో కూడిన దళం అన్ని విధాల సిద్ధమైంది. షాజహాన్‌పూర్‌ నుండి లక్నో వెడుతున్న 8 డౌన్‌ ప్యాసింజరు రైలును 1925 ఆగష్టు 9వ తేదీన కాకోరీ-ఆలంనగర్‌ స్టేషన్ల మధ్య ఆపి, ఆ రైలులో తరలించబడుతున్న ప్రబుత్వ ఖజానాను దోచుకోవాలని పదకం రూపొందింది.

ఈ యాక్షన్‌లో అష్పాఖుల్లా ఖాన్‌, మన్మథనాథ్‌ గుప్తా, చంద్రశేఖర్‌ అజాద్‌, రాజేంద్రప్రసాద్‌ లహరి, కేశవ్‌ చక్రవర్తి, మురారీలాల్‌, ముకుంద్‌లాల్‌, శచీంద్రనాథ్‌ బక్షీ, బిస్మిల్‌ పాల్గొన్నారు. పథకం ప్రకారంగా రైలు కాకోరి, ఆలంనగర్‌ మధ్య కాకోరి

41