పుట:షహీద్-యే-ఆజం అష్ఫాఖుల్లా ఖాన్.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

షహీద్‌ - యే - ఆజమ్‌ అష్పాఖుల్లా ఖాన్‌

ఉత్తర ప్రదశ్‌, బీహార్‌ రాష్ట్రాలలో విప్లవోద్యమం పకడ్బందీగా సాగుతోంది. పలు పటణాల్లో విప్లవ కేంద్రాలు ఏర్పడ్డాయి. విప్లవకారులు నిర్వహిస్తున్న 'యాక్షన్స్‌' విజయవంతం అవుతుండటంతో రెట్టించిన ఉత్సాహంతో అష్పాఖ్‌ లాంటి దేశబక్తి పూరితులైన యువకులు రహస్య విప్లవ దాళాలలో సభ్యత్వం స్వీకరించసాగారు. ఆ రోజుల్లో సహాయ నిరాకరణ ఉద్యామాన్ని గాంధీజీ రద్దు చేయటం, జాతీయ కాంగ్రెస్‌ కొంత కాలం వరకు ఆ ఉద్యమం స్థానంలో మరోక ఉద్యమరూపాన్ని ప్రజలకు చూపక పోవటం వలన ఏర్పడిన నిస్తేజ పరిస్థితులలో విప్లవోద్యమం పురుడుపోసుకుంది.

ఈ వాతావరణాన్ని శ్రీ రాం ప్రసాద్‌ బిస్మిల్‌ మరింత పరిపుష్టం చేయాలను కున్నారు. పలు ప్రాంతాలలో విప్లవ కేంద్రాలను ప్రారంభించాలని, సాహసులైన యువకు లను భారీ సంఖ్యలో దళంలోకి తీసుకోవాలని, విపవోద్యామానికి ప్రజల మద్దతు సంపాదిం చేందుకు ప్రజలను చైతన్యం చేయడానికి సామాజిక వికాస సేవా కంద్రాలను ప్రారంభిం చాలని, గ్రంథాలయాలను ఏర్పాటు చేయాలని పలు పథకాలు రూపొందించారు. విప్లవ సాహిత్యాన్ని ప్రచురించి విసృతంగా పంపిణీ చేయాలని ఆయన భావించారు.

ఈ పథకాలను అమలు చేయడానికి ఆర్థిక వనరుల కరువయ్యాయి. విముక్తి పోరాటంలో ప్రాణాలను సైతం పణంగా పెట్టగల త్యాగధనులైన యువకులను విప్లవోద్యమం సమకూర్చుకోగలిగినా ఆర్థిక లోటు తీరకుంది. ఆ కారణంగా కార్యక్రమాలు ముందుకు సాగటంలేదు. అందువలన ఆర్థిక బలం కోసం బిస్మిల్‌ అన్వేషణ సాగించారు. ఆ అంన్వేషణలో భాగంగా ప్రబుత్వ ఖజానాను, ప్రబుత్వానికి వత్తాసు పలికేజమిందారులను దోపిడి చేయాలని నిర్ణయించిన విప్లవకారులు పలు యాక్షన్స్‌ను విజయవంతంగా నిర్వహించారు.

ఈ పరిస్తితి పాలక వర్గాలలో తీవ్ర కలవరానికి కారణమైంది. ప్రబుత్వం నిఘాను తీవ్రతరం చేసంది. రహస్య పోలీసుల హడవుడి ఎక్కువైంది. విప్లవకారులకు ఎటువంటి సహాయ సహకారాలు లభించకుండా, కట్టుదిట్టమైన చర్యలను ప్రభుత్వం చేపట్టింది. విప్లవకారులకు తీవ్ర ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రభుత్వ చర్యల వలన విప్లవ కారులకు ఆర్థికంగా చాలా గడ్డురోజులు దాపురించాయి. విప్లవ సంఘాలలోని కార్యకర్తల కనీస ఖర్చులకు, చివరకు భోజన సదుపాయాలకు కూడానిధులు కరువయ్యాయి. ఈ విషయాలను బిస్మిల్‌ స్వయంగా చెపుకున్నారు. అప్పటిలో సంఘసభ్యుల ఆర్థిక స్థితిగతులు

37