పుట:షహీద్-యే-ఆజం అష్ఫాఖుల్లా ఖాన్.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

అక్కడి నేతల త్యాగాలను తెలుసుకోండి. మీరు మంచి టై, కోటు లాంటి దుస్తులు ధరించి తప్పకుండా నాయకులు కాగలరు. కాని కార్మికులు, కర్షకులకు ఏమాత్రం మేలు చేయలేరు, అని అష్పాఖుల్లా ఖాన్‌ అన్నారు. (Shaheed Asfaqulla Khan Aur Unka Yug, by Sudhir Vidyardhi, Pages.11 and 121)

శ్రమజీవులతో కలసిమెలసి పనిచేస్తు, వారిని చైతన్యవంతుల్ని చేయమని సూచించారు. శ్రమజీవుల జీవితావసరాలను, కష్టసుఖాలను తెలుసుకోలేని నాయకత్వం శుద్ధ దండగని, శ్రమజీవుల సంక్షేమం పట్టని నాయకుల మీద అష్పాఖుల్లా ఖాన్‌ చురకలు వేసారు. శ్రమజీవుల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో నాయకత్వం తయారు కావాలని, అందుకు మంచి సాహిత్యాన్ని సృస్టించాలని, అటువంటి సాహిత్యాన్ని అందారూ చదవాల్సిన అవసరం ఉందన్నారు.

సమాజంలో సాగుతున్న దోపిడికి కారణం ఎవరూ? శ్రమజీవులకు శతృవు ఎవరూ? అనే అంశం మీద కూడా అష్పాఖ్‌కు ఖచ్చితమైన అవగాహన ఉంది. ఈ విషయమై ఆయన మ్లాడుతూ, దోపిడు దారుడు దోచుకున్నసొత్తుతో, పీడించేవాడు పీడితుల సౌభాగ్యంతో తన కడుపులను నింపుకుంటారు. వకీళ్ళు కక్షిదారుల, జమీందారులు కౌలుదారుల, పెట్టుబడిదారుడు కార్మికుల కష్టార్జితాన్నిజలగలు రక్తాన్ని పీల్చుకున్నట్టు పీల్చుకుంటారు. వీరంతా శ్రమ చేయని పనిదొంగలు. అందువలన దోపిడకి పాల్పడుతుాంటారు. ఈ దోపిడని అంతం చేయడం అత్యవసరం. ఈ శక్తులకు వ్యతిరేకంగా యుద్ధం తప్పదని, అష్పాఖుల్లా ఖాన్‌ ప్రకటించారు. (Shaheed Asfaqulla Khan Aur Unka Yug, by Sudhir Vidyardhi, Page.107)

ఈ విషయాన్నేఆయన కమ్యూనిస్టు గ్రూపు మిత్రులతో అనేవారు. ఈ భావాలను బట్టి తనను ఎవరు కమ్యూనిస్టుగా భావించినా లేక మరోకనిగా భావించినా తనకు ఎటువంటి అభ్యంతరం లేదని కూడ అష్పాఖుల్లా ఖాన్‌ ప్రకటించారు. ఈ రకంగా ఆలోచనలు చేసిన మొదటి విప్లవకారుడాయన, అని శ్రీ సుధీర్‌ విద్యార్థి పేర్కొన్నారు.

విప్లవోద్యామానికి నిధుల కొరత

మాతృభూమి పట్ల అత్యంత గౌరవాభిమానాన్నివ్యక్తీకరించి, దేశం కోసం మరణాన్ని కూడా ఆహ్వానించే అష్పాఖుల్లా లాంటిప్రగతిశీల భావాలు, నిస్వాధ చింతనా పరులైన యువకులు విప్లవోద్యమానికి జవం జీవం అయ్యారు. మాతృభూమి విముక్తి కోసం కంకణం కట్టుకున్న విప్లవకారుల మూలంగా విప్లవ కార్యకలాపాలు ముమ్మర మయ్యాయి. బెంగాల్‌ ప్రదాన కేంద్రంగా విప్లవకారులు దేశమంతా పరివ్యాప్తి కాసాగారు.

36