పుట:షహీద్-యే-ఆజం అష్ఫాఖుల్లా ఖాన్.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

షహీద్‌ - యే - ఆజమ్‌ అష్పాఖుల్లా ఖాన్‌

అష్పాఖ్‌ అన్ని రకాల దోపిడిని వ్యతిరేకించారు. అన్న్ని రకాల దోపిడి నుండి ప్రజలు విముక్తం కావాలని ఆయన ఆశించారు. అటువంటి ఇండియాను ఆయన కాంక్షించారు. రైతులు, కార్మికులు ఎటువంటి దోపిడికి గురికారాదు. ఆన్నిరకాల దోపిడల నుండి ప్రజలకు స్వేచ్ఛ ఉండాలి, అని ఆయన తన స్వప్నాన్నివ్యక్తం చేశారు.

(Where there would be no exploitation of Farmers and labourers. Where would be freedom from all types of exploitations - Great Revolutionary Martyr Ashfaqullah Khan, Dr.Omkar Nath Tripathi, Basha Sangam, Allahabad, 2001, Page.7)

ఆర్థిక అసమానతలే కాదు, సామాజిక అంతరాలు కూడ కానరాని స్వతంత్ర భారతదేశాన్ని అష్పాఖ్‌ కోరుకున్నారు. ఈ మేరకు ఓలేఖ రాస్తూ, నా దేశంలోని పేద ప్రజానీకమంతా సుఖశాంతులతో సమానంగా జీవించగల స్వతంత్ర భారతదేశాన్నినేను ఆకాంక్షిస్తున్నాను, అని అన్నారు. సామాజిక అంతరాల నుండి స్వేచ్ఛకు సంబంధించి ఆయన తన కలల దృశ్యాన్ని జైలు నుండి మిత్రులకు రాసిన పలు లేఖలలో వర్ణించారు. ఆ రోజులలో కులం-మతం, ఆర్థిక స్థాయినిబట్టి ప్రజల మధ్య అంతరాలు ఉండటం వలన, అఫ్పాఖుల్లాలోని సృజనశీలుడు తాను కలలు గంటున్న సామాజిక వ్యవ్యస్థను ఈ విధంగా చిత్రించారు.

నా తరువాత వీలయినంత త్వరగా వర్క్‌షాపులో పని చేసే మేస్త్రీ అబ్దుల్లా, ఘనీ, రైతులు కలసి శ్రీ ఖలిఖుజ్జామాన్‌ (ప్రముఖ రాజకీయ నాయకుడు - సంపన్న జమీందారు), శ్రీ జగన్నాథ్‌ నారాయణ ముల్లా (ప్రముఖ న్యాయవాది, లిబరల్‌ పార్టీ నాయకుడు), ముహమ్మదాబాద్‌ రాజా సాహెబ్‌ (ముహమ్మదాబాద్‌ జమీందారు)లతో కలిసి లక్నోలోని ఛత్తర్‌ మంజిల్‌ (ప్రసిద్థ కట్టడం)లోని కుర్చీలలో ఆశీనులై కన్పించేలా చూడాలని ఆ దేవుడ్ని కోరుకుంటున్నానని, ఆష్పాఖుల్లా ఖాన్‌ ప్రకటించారు. (Shaheed Asfaqulla Khan Aur Unka Yug, Page.10)

ఆయన చిత్రించిన విధంగా సామాజిక వ్యవస్థ రూపొందాలని భగవంతుడ్ని వేడుకున్నారు. ఆయన తన ఆకాంక్షలను, ఉరిశిక్ష అమలుకు ఎదురుచూస్తూ, జైలు గోడల మధ్య గడు పుతున్న సమయంలో రాశారు. ఆ కారణంగా తాను ఉన్నా లేకపోయినా అంతరాలు లేని సామాజిక వ్యవస్థను సృష్టించాల్సిందిగా కోరారు. ఈ మేరకు తన కోర్కెను వెల్లడించటంలో అష్పాఖ్‌కు, సర్దార్‌ భగత్‌సింగ్ కు వ్యత్యాసం కనిపిస్తుంది. నూతన వ్యవస్థల నిర్మాణానికి ప్రజలు నడుంకట్టాలని భగత్‌సింగ్ సైద్ధాంతీకరించగా,

29