పుట:షహీద్-యే-ఆజం అష్ఫాఖుల్లా ఖాన్.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

ప్రగతిశీల భావాల దార్శనికుడు

భారతదేశాన్ని బ్రిటిష్‌ వలసపాలకుల నుండి విముక్తం చేశాక స్వతంత్ర భారత దేశం ఏవిధంగా ఉండాలన్న విషయంలో అష్పాఖుల్లా ఖాన్‌ చాల స్పష్టమైన అభిప్రాయాలను కలిగి ఉన్నారు. స్వతంత్ర భారతంలో ఎటువంటి అసమానతలకు చోటు ఉండరాదని ఆయన ఆకాంక్షించారు. కాని ఆయన తన భావాలకు స్పష్టమైన సైద్ధాంతిక స్వరూపాన్ని కల్పించలేకపోయారు. కాకోరి విప్లవకారుల తరువాత ఆ భావాలకు సర్దార్‌ భగత్‌సింగ్ స్పష్టమైన సైద్ధాంతిక రూపం కల్పించారు. భగత్‌సింగ్ కంటే నాలుగు సంవత్సరాల ముందు విప్లవోద్యమంలో ప్రాణాలర్పించిన అష్పాఖుల్లా ఖాన్‌ ఆర్థిక అసమానతలు, సాంఫీుక అంతరాలు, ఏరకమైన దోపిడీలేని సమసమాజ వ్యవస్థను ఆశించారు. ఆశించటమే కాదు ఆయన ఆకాంక్షల భారత దేశం ఎలా ఉండాలో ఆ విషయాలను కూడా ఆయన వివరించారు. ఈ మేరకు ఆయన మిత్రులకు, సన్నిహితులకు రాసిన లేఖలలో ఆ ఆలోచనలు చాలా స్పష్టంగా దర్శనమిస్తాయి.

అష్పాఖుల్లా ప్రగతిశీల ఆలోచనల విషయాన్నిప్రస్తావిస్తూ, ఈ విషయంలో ఆయన కాకోరి విప్లవ కాలం నాటి తన సహచర విప్లవ యోధుల కంటే అష్పాఖ్‌ ముందున్నారు. ఆయన మహోన్నత భావాలను కలిగి ఉన్నారు. ఆయన స్వదేశీ, సద్భావనా, సామ్యవాద లక్ష్యాల సాధన కోసం ప్రజలను చెతన్యవంతులను చేయాలన్నారు. అన్ని రకాల అంతరాలు, దోపిడి అంతం కావాలని, అష్పాఖ్‌ ఆకాంక్షించారని ప్రముఖ చరిత్రకారుడు శ్రీ సుధీర్‌ విద్యార్థి అభిప్రాయపడ్డారు. (Shaheed ASfaqulla Khan Aur Unka Yug by Sudhir Vidhyardhi Page.10)

అష్పాఖ్‌ తనలోని సామ్యవాద, సమసమాజ భావనలను స్పష్టీకరించే పడికట్టు పదాలను మాత్రం ఉపయోగించలేదు. ఆయన తన భావాలను సాదాసీదాగా తనదైన భాషలో వ్యక్తీకరించారు, దృశ్యీకరించారు. ఆ కాలంలో అష్పాఖుల్లాఖాన్‌ ప్రగతిశీల భావాలను వ్యక్తం చేయడం పట్ల శ్రీ సుధీర్‌ విద్యార్థి ఆశ్చర్యం వ్యక్తం చేసారు. ఈకోణం నుండి విశ్లేషిస్తే, సామ్యవాద భావనలను వ్యక్తం చేయడంలో అష్పాఖుల్లా ఖాన్‌ సర్దార్‌ భగతసింగ్ కంటే ముందున్నారని ఆయన ప్రకటించారు. అఫ్పాఖ్‌లో ముడిసరుకుగా పొటమరించిన సమసమాజ భావాలను కాకోరి విప్లవకారుల తరువాత రంగం మీదకు వచ్చిన ప్రముఖ విప్లవకారుడు సర్దార్‌ భగత్‌ సింగ్ లాంటి యోధులు చక్కని సైద్ధాంతిక రూపాన్ని కల్పించారని శ్రీ సుధీర్‌ విద్యార్థి తన Shjaheed Asfaqulla Khan Aur Unka Yug: Page.10) గ్రంథMలో పేర్కొన్నారు.

28