పుట:షహీద్-యే-ఆజం అష్ఫాఖుల్లా ఖాన్.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

షహీద్‌ - యే - ఆజమ్‌ అష్పాఖుల్లా ఖాన్‌

అని సంబోధిసుండేవాడివి. ఒకసారి నీవు తీవ్రమెన గుండెదడ (Palpitation of heart) వచ్చి అచేతనంగా పడిపోయావు. నీనోిటి నుండి మాటిమాటికి 'రామ్‌..హాయ్‌.. రామ్‌' అను శబ్దాలే వెలువడ్డాయి. దానితో నీవద్దనిలబడ్డ మీ సోదరులు, బంధుజనులంతా యిదేమిలా 'రామ్‌..రామ్‌' అంటున్నాడని మహాశ్చర్యపడిపోసాగారు. అరే 'అల్లా.. అల్లా...అల్లా అనరా' అని నిన్నుకోరసాగారు. కాని నీవు రామ్‌..రామ్‌ అనడం మానలేదు . ఈ రామనామ జపం రహస్యం తెలిసిన మిత్రుడొకరు అక్కడికి రావడం, తక్షణమే నన్ను పిలిపించడం జరిగింది. నన్నుకలిసిన తర్వాతే నీకు ఉపశమనం కలిగింది. ఇక అప్పుడందరికీ ఈ రామనామ జపం లోగుట్టు ఏమిటో అర్థమైపోయింది!., అన్నారు. (బిస్మిల్‌ ఆత్మకధ: పేజి.106).

బిస్మిల్‌ ఎన్నడూ కూడా తన మతపరమైన భావాల ద్వారా అష్పాఖుల్లాను ప్రబావితం చేయలేదు. ఈ విషయంలో ఆయన చాలా స్పష్టంగా ఉన్నారు. ఆష్పాఖ్‌ కుటుంబీకులు ఆయనెక్కడ బిస్మిల్‌ ద్వారా శుద్ధి చేయబడతాడోనని భయపడసాగారు. ఆ విషయం తెలుసుకున్న ఆయన, నీ ప్రవర్తన చూసి మీ వాళ్ళంతా, 'నీవెక్కడ మన మతం వదిలి, శుద్ధి చేయించుకుని హిందువై పోతాడో' నని ఆందోళన చెందుతూండేవాళ్ళు. కానీ, నీ హృదయం ఏ విధంగానూ అశుద్దంగా వుండలేదే, మరి నీవింకే వస్తువును శుద్ధి చేయిస్తా వనుకున్నారు. ఈ విధంగా నీవు సాధించిన ప్రగతి నా హృదాయాన్ని పూర్తిగా గెలుచుకున్నది. (బిస్మిల్‌ ఆత్మకధాó పేజి 106) అని అష్పాఖ్‌ మత మనోభావాల పట్ల బిస్మిల్‌ గౌరవం వ్యక్తంచేశారు.

బిస్మిల్‌ ఎక్కడుంటే అష్పాఖుల్లా ఖాన్‌ అక్కడుండేవారు. ఈ యువకులు ఆదర్శ ప్రాయమైన స్నేహబంధాన్ని ప్రదర్శించారు. ఒక మహయత్తర లక్ష్యాన్నిసాధించేందుకు ఏర్పడిన బంధం జాతి, మత, కుల ప్రాంతాలకు అతీతంగా ఉంటుందని రుజువు చేసారు. దేశాన్ని వలస పాలకుల నుండి విముక్తం చేసేందుకు ప్రారంభమైన సాయుధ పోరాటం మతం, మతధర్మాల బంధనాలను కూడా ఛేదించిందనడానికి ఈ ఇరువురు విప్లవకారుల ప్రవర్తన, స్నేహం ప్రబల రుజువుగా చరిత్రలో స్థిరపడింది.

ఈ ఇరువురిని మిత్రులు, బంధువులు మతభ్రష్టులుగా నిందించారు. బిస్మిల్‌ను ఆయన స్నేహితులు హెచ్చరిస్తూ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, 'మాబృందంలో తరచూ నీ గురించి (అష్పాఖుల్లా ఖాన్‌ గురించి) చర్చ వచ్చేది. ఏమో నమ్ముతున్నావు.. మోసపోయేవు సుమా అని అనేవాళ్ళు.. కానీ నీవు నెగ్గావు' (బిస్మిల్‌ ఆత్మకధ పేజి.

21