పుట:షహీద్-యే-ఆజం అష్ఫాఖుల్లా ఖాన్.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

సహాయ నిరాకరణోద్యంలో భాగస్వామి పరాయి పాలకులు స్వజనుల మీద సాగిస్తున్న పెత్తనం, జులుంను గమనిస్తున్న అష్పాఖుల్లా స్వేచ్ఛ-స్వాతంత్య్రాల కోసం సాగుతున్న బ్రిటిషు వ్యతిరేక పోరాటాల పట్ల ఆకర్షితు లయ్యారు. గాంధీజీ నాయకత్వంలో సాగుతున్న ఉద్యమంలో ఆయన పాఠశాల విద్యార్థిగా పాల్గొన్నారు. బ్రిటిషర్ల బానిసత్వానికి ప్రతీకలైన ఏ వస్తువును కూడ ఇక వాడరాదని ఆయన నిర్ణయించుకున్నారు. ఆంగ్లేయుల వస్త్రాలు మాత్రమే కాదు, వారి వస్త్రధారణను కూడ ఆయన వ్యతిరేకిం చారు. స్వదేశీ వస్తువులను మాత్రమే వాడ మన్నారు. మాతృదేశం కోసం జీవించ మంటూ ప్రచారం ఆరంభించారు.

ఈ చర్య ఆయన కుటుంబీకులకు నచ్చలేదు. ఎంతగా చెప్పినా ఆష్పాఖ్‌ మాట వినలేదు. చివరకు మిషన్‌ స్కూల్‌ నుండి ఆయ నను బహిష్కరించారు . అష్పా ఖ్ కుటుంబీకులంతా ఉన్నత విద్యావంతులు కావటం, ఆయన మాత్రం చదువు పట్ల అంతగా శ్రద్ధ్ద చూపకపోవటం, బ్రిటిషు ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాలలో భాగస్వామి కావటం పట్ల కుటుంబీకులు ఆగ్రహించారు. తల్లి తండ్రులు మాత్రమేకాదు ఆయన చదువుతున్న Abbie Rich Mission High School ప్రధానోపాధ్యాపకుడు కూడా ఆగ్రహించి ఆయనను పాఠశాల నుండి బహిష్కరించారు.

ఆ బహిష్కరణకు ఆయన బాధపడలేదు. అంతలో గాంధీజి సహాయనిరాకరణ ఉద్యామాన్ని విరమించారు. ఆ చర్యతో ఆయన మస్తిష్కాన్ని విప్లవోద్యమ భావాలు చుట్టు ముట్టాయి. అతి కొద్దిమంది ఆయుధాలతో పోరాడి ఆంగ్లేయ ప్రభుత్వానికి చరమగీతం పాడగలరా ? అన్నప్రశ్న పునరావృతమైంది. ఆ సమయంలో ఒక విప్లవకారుని వీరోచిత చర్య శతృసైన్యం విధ్యంసం నుండి ఆయన తన దేశాన్ని ఎలా కాపాడిందో తెలుపు పుస్తకం లవ్‌ ఆఫ్‌ కంట్రీ ఆయన లభించింది. ఆ పుస్తకంలో శతృసైన్యం తన దేశం మీద విరుచుకుపడుతున్నప్పుడు ముగ్గురు మిత్రుల సహకారంతో డర్బన్‌ నది మీదున్న వంతెనను విద్వంసం చేసి, శతృ సైనికులను నగరంలోకి ప్రవశింపనివ్వకుండా నిలువరించి,



14