పుట:షహీద్-యే-ఆజం అష్ఫాఖుల్లా ఖాన్.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
షహీద్‌ - యే - ఆజమ్‌ అష్పా ఖుల్లా ఖాన్‌

చాలామంది ఉన్నారన్నాడు. బ్రిటిష్ ప్రబుత్వానికి వ్యతిరేకంగా పనిచేసే రహస్య దళాలలో వీరు సభ్యులని, ప్రబుత్వపక్షంవహించే ధనికులను వారు దోచుకుంటున్నారని తెలిపాడు. రాజారాం లాంటి యువకులు మాతృభూమి పట్ల అపార గౌరవం, ప్రజల పట్ల ప్రేమ కలిగిన వారు, బ్రిటిషు ప్రభుత్వం గాని, ఆ ప్రభుత్వానికి వంతపాడే వ్యక్తులకు గాని విప్లవకారులు వ్యతిరేకమని ఆ మిత్రుడు వివరించాడు.

ఆ వివరాలు అష్పాఖ్‌లో ఆసక్తిని రెకెత్తించాయి. ఈ సందర్భంగా ఆ మిత్రుడితో ఆయన హాస్యమాడుతూ, నీవు కూడ రహస్య దళంలోని సభ్యుడవని తెలిస్తే నిన్ను కూడ అరెస్టు చేయించేవాడ్నిఅన్నారు. అందుకు బదులుగా అతడు ఆ విప్లవకారుల మాదిరిగా తాను కూడ దేశం కోసం మరణించడానికి కూడ సిద్ధాంగా ఉన్నానని ఆన్నాడు. ఆ మిత్రుడు యథాలాపంగా ఆన్న మాటలతో అష్పాఖ్‌ ఆశ్చర్యానికి లోనయ్యారు. ఆ మాటలు ఆయన మనస్సును పట్టేశాయి.

ఆ క్రమంలో మంచి చదువరి అయిన అష్పాఖ్‌ పలు పుస్తకాలు, పత్రికల ద్వారా దేశంలో బ్రిటిష్‌ ప్రబుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాలు-పోరాటాల గురించి తెలుసుకోసాగారు. ఆ పోరాటాలలో బెంగాల్‌కు చెందిన విప్లవకారుల సాహసాలు, శ్రీ ఖుదీరాం బోస్‌, శ్రీ కన›యలాల్‌ లాంటి యోధుల ప్రాణత్యాగాల గురించి తెలుసుకున్న అష్పాఖ్‌ తాను కూడ అంత వాడు కావాలని, ఆ వీరుల్లాగ మాతృభూమి కోసం పోరాడా లని, ప్రాణాలు అర్పించాలని కలలు కనడం ప్రారంభించారు.

అష్పాఖుల్లా ఖాన్‌ విప్లవోద్యామానికి ఆకర్షితులైనా, ఆ ఉద్యమాల విజయం మీద పలు అనుమానాలుండేవి. గుప్పెడు మంది కూడ లేని రహస్యదళ సభ్యులు, కొన్ని తుపాకులతో, మరికొన్ని ఆయుధాలతో అన్నిరకాల ఆయుధాలు, అంగబలం గల బ్రిటిష్ ప్రభుత్వాన్నిఎదుర్కోగలరా? ఆ విధంగా శతృవును ఎదాుర్కొని విజయం సాధించగలమా? అది సాధ్యామా? విప్లవకారుల సాహసాలు, త్యాగాలు సత్పలితాలను సాధించగలవా? అనే ప్రశ్న్లలు ఆయనను వేధించసాగాయి. ఆ ప్రశ్నలకు సమాధానం అందక సత మత మవుతున్నా ఆయ మస్తిష్కం మహాత్ముడు ఆరంభించిన సహాయనిరాకరణోద్యమం దిశగా ఆకర్షించబడింది. అష్పాఖుల్లా ఖాన్‌ పాఠశాల విద్యార్థిగా బ్రిటిష్‌ వ్యతిరేక ఉద్య మంలో పాల్గొనాలనుకున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగా తనకు పరిచయం అయిన సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొని సాహసోపేత స్వాతంత్ర్య సమరయాధుని జీవితాన్ని చిన్ననాటనే ఆరంభించారు. (Great Revolutionary Martyr. Ashfaqullah Khan, Bhasha Sangam, Allahabad, 2001, Page.5) 13