పుట:షహీద్-యే-ఆజం అష్ఫాఖుల్లా ఖాన్.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

షహీద్‌ - యే - ఆజమ్‌ అష్పాùఖుల్లా ఖాన్‌

షహీద్‌-యే-ఆజమ్‌

అష్పాùఖుల్లా ఖాన్‌ ్‌

మహత్మాగాంధీ భారత రాజకీయరంగ ప్రవేశం చేశాక సహయ నిరాకరణ ఉద్యమం ప్రారంభించి, బ్రిీటిష్‌ వ్యతిరేక పోరాటానికి శ్రీకారం చుట్టారు . ఈ ఉద్యమంలో బహుళ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. మాతృభూమి విముక్తికి సాయధా పోరాటమే మార్గమనుకున్నవిప్లవకారులు కూడ తమ ఆయుధాలను ఆవలపెట్టి ఉద్యమంలో ఉత్సాహంగా భాగస్వాములయ్యారు. భరతగడ్డ మీది ప్రజలంతా ఏకోన్ముఖంగా ఉద్యమించడంతో సహాయ నిరాకరణ ఉద్యమం పతాక స్థాయికి చేరుకుంది. ప్రజలు తెగించి ఎంతటి సాహసానికైనా సమాయత్తం అవుతున్న సమయంలో ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని చౌరీచౌరాలో జమీందారులకు వత్తాసు పలికిన పోలీసులు, ఇరువురు ఉద్యామకారులను పొట్టనపెట్టుకున్నారు. ఈ దుర్గటనతో ఆగ్రహించిన ప్రజలు పోలీసు స్టేషన్‌ను చుట్టుముట్టారు. పోలీసులు కాల్పులు జరుపగా ప్రజలు ప్రతీకార 9