పుట:శ్రీ శివ స్తోత్ర మాల.pdf/29

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

ఝంకారాశ్రయ భృంగిరిట ప్రియ, ఒంకారేశ మహేశశివ | సాంబ |
జ్ఞానాజ్ఞాన వినాశక నిర్మల, దీనజనప్రియ దీప్తశివ | సాంబ |

టంకాధ్యాయుత ధారణ సత్వర, హ్రీంకారాది సురేశశివ | సాంబ |
ఠంకస్వరూప సహకారోత్తమ, వాగీశ్వర వరదేశశివ | సాంబ |
డంభ వినాశన డిండిమభూషణ, అంబరవాస చిదీశశివ | సాంబ |
ఢంఢం డమరుక ధరణీనిశ్చల, ఢుంఢి వినాయక సేవ్యశివ | సాంబ |
నళిన విలోచన నటనమనోహర, అళికులభూషణ అమృతశివ | సాంబ |

తత్వమసిత్యాది వాక్య స్వరూపగ, నిత్యానంద మహేశశివ | సాంబ |
స్థావరజంగమ భువనవిలక్షణ, భావుక మునివర సేవ్యశివ | సాంబ |
దుఃఖవినాశన దళితమనోన్మన, చందనలేపిత చరణశివ | సాంబ |
ధరణీధర శుభధవళ విభాస్వర, ధనదాది ప్రియ దానశివ | సాంబ |
నానామణిగణ భూషణ నిర్గుణ, నటన జనప్రియ నాట్యశివ | సాంబ |

పన్నగభూషణ పార్వతినాయక, పరమానంద పరేశశివ | సాంబ |
ఫాలవిలోచన భానుకోటి ప్రభ, హాలాహలధర అమృతశివ | సాంబ |
బంధవినాశన బృహదీసామర, స్కందాదిప్రియ కనకశివ | సాంబ |
భస్మవిలేపన భవభయనాశన, విస్మయరూప విశ్వేశశివ | సాంబ |
మన్మథనాశన మధుపానప్రియ, సుందర పర్వతవాసశివ | సాంబ |

యతిజన హృదయ నివాసిత ఈశ్వర విధి విష్ణ్వాది సురేశశివ | సాంబ |
రామేశ్వర రమణీయ ముఖాంబుజ, సోమేశ్వర సుకృతేశశివ | సాంబ |
లంకాధీశ్వర సురగణసేవిత, లావణ్యామృత లసితశివ | సాంబ |
వరదాభయకర వాసుకిభూషణ, వనమాలాది విభూషశివ | సాంబ |

శాంతిస్వరూప జగత్రయ చిన్మయ కాంతిమతిప్రియ కనకశివ | సాంబ |
షణ్ముఖజనక సురేంద్రమునిప్రియ, షాడ్గుణ్యాది సమేతశివ | సాంబ |
సంసారార్ణవ నాశన శాశ్వత, సాధుహృది ప్రియవాసశివ | సాంబ |
హర పురుషోత్తమ అద్వైతామృత, పూర్ణమురారి సుసేవ్యశివ | సాంబ |
ళాళితభక్త జనేశనిజేశ్వర, కాళినటేశ్వర కామశివ | సాంబ |
క్షరరూపాది ప్రియాన్వితసుందర, సాక్షిజగత్రయ స్వామిశివ | సాంబ |

సాంబసదాశివ సాంబసదాశివ సాంబసదాశివ సాంబశివ ||
సాంబసదాశివ సాంబసదాశివ సాంబసదాశివ సాంబశివ ||