పుట:శ్రీ శివ స్తోత్ర మాల.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రంక స్వరూప సహకారోత్తమ వాగీశ్వర వరదేవ శివ
డంబ వినాశన డిండిమ భూషణ అంబరవాస చిదీశశివ

డం డం డమరుక ధరణీ నిశ్చల డుంఢి వినాయక సేవ్య శివ
ణలిన విలోచన నటన మనోహర అళి కుల భూషణ అమృత శివ
తత్వమ సీత్యాది వాక్య స్వరూపక నిత్యానంద మహేశశివ
స్థావర జంగమ భువన విలక్షణ భావుక మునివర సేవ్య శివ
దుఃఖ వినాశక దళిత మనోన్మన చందన లేపిత చరణ శివ
ధరణీ ధర శుభ ధవళ మనోన్మన చందన లేపిత చరణ శివ
నానా మణి గణ భూషణ నిర్గుణ నట జన సుప్రియ నాట్య శివ
పన్నగ భూషణ పార్వతి నాయక పరమానంద పరేశశివ
ఫాల విలోచన భాను కోటి ప్రభ హాలాహల ధర అమృత శివ
బంధ వినాశన బృహదీశామర స్కందాది ప్రియ కనక శివ
భస్మ విలోపన భవ భయ నాశన విస్మయ రూప విశ్వేశ శివ

మన్మధ నాశన మధుపాన ప్రియ మందర పర్వత వాస శివ
యతి జన హృదయ నివాసిత ఈశ్వర విధి విష్ణ్యాది సురేశ శివ
రామేశ్వర రమణీయ ముఖాంభుజ సోమ శేఖర సుకృతి శివ
లంకాధీశ్వర సుర గణ సేవిత లావణ్యా మృత లసిత శివ
వరదా భయకర వాసుకి భూషణ వన మాలాది విభూష శివ
శాంతి స్వరూప జగత్త్రయ చిన్మయ కాంతి మతి ప్రియ కనక శివ
షణ్ముఖ జనక సురేంద్ర మునిప్రియ షాడ్గుణ్యాది సమేత శివ
సంసారార్ణవ నాశన శాశ్వత సాధు హృది ప్రియ వాస శివ
హర పురుషోత్తమ అద్వైతామృత పూర్ణ మురారి సుసేవ్య శివ
ళాళిత భక్త జనేశ నిజేశ్వర కాళీ నటేశ్వర కామ శివ
క్షర రూపాది ప్రియాన్విత సుందర సాక్షి జగత్త్రయ స్వామి శివ

సాంబసదాశివ సాంబసదాశివ సాంబసదాశివ సాంబశివ
సాంబసదాశివ సాంబసదాశివ సాంబసదాశివ సాంబశివ