పుట:శ్రీ శివ స్తోత్ర మాల.pdf/26

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

శివ వర్ణమాలా స్తోత్రం

సాంబసదాశివ సాంబసదాశివ సాంబసదాశివ సాంబశివ
సాంబసదాశివ సాంబసదాశివ సాంబసదాశివ సాంబశివ

అధ్బుత విగ్రహ అమరాదీశ్వర అగణిత గుణ గణ అమృత శివ
ఆనందామృత ఆశ్రిత రక్షక ఆత్మానంద మహేశ శివ
ఇందు కళాధర ఇంద్రాది ప్రియ సుందర రూప సురేశశివ
ఈశ సురేశ మహేశ జనప్రియ కేశవ సేవితపాద శివ
ఉరగాది ప్రియ భూషణ శంకర నరక వినాశ నటేశశివ
ఊర్జిత దానవ నాశ పరాత్పర ఆర్జిత పాప వినాశ శివ
ఋగ్వేద శ్రుతి మౌళి విభూషణ రవి చంద్రాగ్ని త్రినేత్ర శివ
ఋప మనాది ప్రపంచ విలక్షణ తాప నివారణ తత్త్వ శివ
లింగ స్వరూప సర్వ బుధ ప్రియ మంగళ మూర్తి మహేశశివ

లూతాదీశ్వర రూప ప్రియ శివ వేదాంత ప్రియ వేద్య శివ
ఏకానేక స్వరూప విశ్వేశ్వర యోగి హృది ప్రియ వాస శివ
ఐశ్వర్యా శ్రయ చిన్మయ చిద్ఘన అచ్యుతానంత మహేశశివ
ఓంకార ప్రియ ఉరగ విభూషణ హ్రీంకారాది మహేశశివ
ఔరసలాలిత అంతకనాశన గౌరీసమేత మహేశశివ
అంబరవాస చిదంబర నాయక తుంబురు నారద సేవ్య శివ
ఆహారప్రియ ఆది గిరీశ్వర భోగాది ప్రియ పూర్ణ శివ
కమలాస్యార్చిత కైలాస ప్రియ కరుణా సాగర కాంతి శివ
గంగా గిరిసుత వల్లభ గుణ హిత శంకర సర్వ జనేశ శివ
ఖడ్గ శైల మృదుడక్కాద్యా యుధ విక్రమ రూప విశ్వేశశివ

ఘాతుక భంజన పాతక నాశన గౌరీ సమేత గిరీశ శివ
జజశ్రిత శ్రుతి మౌళి విభూషణ వేద స్వరూప విశ్వేశ శివ
చండ వినాశన సకల జన ప్రియ మండలాధీశ మహేశశివ
ఛత్ర కిరీట సుకుండల శోభిత పుత్ర ప్రియ భువనేశశివ
జన్మజరా మృతి నాశన కల్మష రహిత తాప వినాశశివ
ఝంకారా శ్రయ బృంగి రిటి ప్రియ ఓం కారేశ మహేశశివ
జ్ఞానా జ్ఞానా వినాశక నిర్మల దీన జన ప్రియ దీప్త శివ
టంకాద్యాయుధ ధారణ సత్వర హ్రీంకాది సురేశ శివ