Jump to content

పుట:శ్రీ రాణా ప్రతాపసింహ చరిత్ర.pdf/187

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

150

రా ణా ప్ర తా ప సిం హ చ రి త్ర

    తెఱఁగున బొమ్మనన్ గలనె , దేవునియిల్లో మఱొక్కచోటొ నే
    నెఱుఁగనె; యెల్లకార్యములు నేసమకూర్చేద నీకుఁ దృప్తిగన్ 281
    
సీ॥ నీకన్నియల బాదుషా కిచ్చుటయులేక
             జుట్టుపన్నేనాఁడు గట్టకుండఁ
    బనిఁమీద సింధువాహిని దాటుటయులేక
             యాస్ధానమున కెప్పుడరుగకుండ
    జాతీయు మతము లేశము వీడుటయులేక
             సేనాధిపత్యంబు చెందకుండ
    మోఁకాలిపై వ్రాలి మ్రొక్కి నిల్చుటలేక
             గుఱ్ఱంబులను దెచ్చుకొనకయుండ
             
గీ॥ వత్సరారంభపు నవరాత్య్రుత్సవముల
   సంతలకు రాణివాసమ్ము చనుటలేక
   కడుపులోఁ జల్ల యిటునటు గదలకుండ
   సమతదై వార మీకు నే సంధిఁగూర్తు. 282
   
సీ॥ నీ కగౌరవమైన నాకైనయట్లె! నీ
             దివ్యచిత్తము సుఖస్థితిని నుంచు
    మీపర్ణశాలలో నేకాంతముగ నుండు
             మిచటికి నొరులెవ్వ రెఱుఁగకుండ
    మెలమెల్లఁ జీఁకటుల్ మొలుచువేళకుఁ దెత్తు
             నక్బరు చేవిని రహస్యముగను
    “సరియె పొమ్మను”! మొక్క క్షణమున నాతని
             నేను గొంపోయి ఢిల్లీనిజేర్తు
             
గీ॥ నుదయపురి నేలుకొనుము: చిత్తూరుపురము
    బాగుపఱుపంగఁ బట్టు ద్రవ్యంబుఁ దెత్తుఁ
    గొదువ యనిపించినను మాళ్వ ఘూర్జరములు
    తీసికొననాజ్ఞ నెత్తి పై మోసితేత్తు. 283 283
    
సీ॥ ముప్పదిమూఁడు రాణ్ముఖ్యవంశములు పా
              దములు గొల్చెడు గురుస్థాన మీవు